AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: అకస్మాత్తుగా బరువు కోల్పోయారా? దానికి కారణం అదే కావచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి!

న శరీరంలో అకస్మాత్తుగా ఏ మార్పులూ రాకూడదు. అకస్మాత్తుగా వచ్చే మార్పులు మన అనారోగ్యానికి సంకేతంగా చెప్పవచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడం మంచిది కాదు.

Weight Loss: అకస్మాత్తుగా బరువు కోల్పోయారా? దానికి కారణం అదే కావచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి!
Weight Loss
KVD Varma
|

Updated on: Oct 27, 2021 | 8:21 AM

Share

Weight Loss: మన శరీరంలో అకస్మాత్తుగా ఏ మార్పులూ రాకూడదు. అకస్మాత్తుగా వచ్చే మార్పులు మన అనారోగ్యానికి సంకేతంగా చెప్పవచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడం మంచిది కాదు. అకస్మాత్తుగా బరువు తగ్గడం మన కాలేయం (లివర్) పనితీరులో వచ్చిన మార్పులు కావచ్చు.  కాలేయం(లివర్) మన శరీరంలో ముఖ్యమైన భాగం. జీర్ణక్రియలో సహాయపడటంతో పాటు, ఇది అల్బుమిన్, బైల్ వంటి ఎంజైమ్‌లను కూడా ఉత్పత్తి చేస్తుంది. కాలేయంలో ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుంది. ఈ వ్యాధులలో ఒకటి లివర్ సిర్రోసిస్. ఇందులో కాలేయం నెమ్మదిగా క్షీణించడం ప్రారంభిస్తుంది. ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్ లాంటిదని వైద్యులు చెబుతున్నారు. దీనిని మొదట్లో గుర్తించలేము. తరువాత అది ప్రాణాంతకం అవుతుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు కోల్పోతుంటే లేదా బలహీనంగా అనిపిస్తే, దానిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే లివర్ సిర్రోసిస్ లక్షణాల్లో ఇది ఒకటి.

సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్, గ్యాస్ట్రో డిపార్ట్‌మెంట్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ అరోరా ఈ విషయాన్ని వివరించారు. దాని ప్రకారం ఒక వ్యక్తికి కాలేయం దెబ్బతిన్నప్పుడు, అది తనను తాను రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక కణజాలం ఏర్పడుతుంది. దీన్నే మచ్చ కణజాలం అంటారు. ఈ కణజాలాలు కాలేయంలో రక్త ప్రవాహాన్ని తగ్గించడం ప్రారంభిస్తాయి. ఇది కాలేయం పని చేసే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ కణజాలాలు ఎంత ఎక్కువగా పెరిగితే, అంతగా కాలేయం సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు కాలేయం పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. అయితే, ఈ వ్యాధి లక్షణాలు వెంటనే తెలియవు. అయినప్పటికీ, ఎక్కువ మద్యం సేవించే వ్యక్తులు లేదా ఊబకాయం, మధుమేహం ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. వారికి అది వచ్చే అవకాశం ఎక్కువ. అయితే, లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా లివర్ సిర్రోసిస్‌ను నియంత్రించవచ్చు.

ఇవీ లక్షణాలు:

డాక్టర్ అనిల్ చెబుతున్న దాని ప్రకారం.. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న రోగులకు ఆకలి తక్కువగా ఉంటుంది. అతను అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా, వ్యాధితో బాధపడుతున్న రోగి బరువు కూడా ఎటువంటి కారణం లేకుండా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, చిన్న గాయం అయినా కూడా అధిక రక్తస్రావం అవుతుంది. ఇది కూడా సిర్రోసిస్ లక్షణం కావచ్చు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

లివర్ సిర్రోసిస్ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు చేర్చండి. ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. ఇది ఈ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి: Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..

Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!