AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు..

నేటి జీవనశైలిలో చాలామంది సరైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పని ఒత్తిడి, మొబైల్ వినియోగం, టీవీ, సోషల్ మీడియా వంటి అలవాట్ల కారణంగా రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం సాధారణమైపోయింది. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు..
lack of sleep health effects
Rajashekher G
|

Updated on: Jan 22, 2026 | 2:19 PM

Share

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి చాలా ఆరోగ్యకరమైన విషయాలకు దూరమవుతున్నాడు. అందులో ప్రధానమైనది నిద్ర. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ సమయాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు రాత్రి వేళల్లోనూ పనిచేయడం, ఇంట్లో ఉంటే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయి సమయానికి నిద్రపోవడం లేదు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కోవడం అనేవి రెండూ కూడా మనిషి ఆరోగ్యానికి హానికరమైనవేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో 7 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. అందుకే రాత్రి సమయంలో తప్పనిసరిగా 7 గంటలపాటు నిద్రకు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. నిద్ర తక్కువైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర ఎందుకు అంత ముఖ్యము?

నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. శరీర కణాలు పునరుద్ధరించబడతాయి. మెదడు జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. అందుకే పెద్దవారికి రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.

రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే వచ్చే సమస్యలు

మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి (Stress) పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు రావచ్చు. చిరాకు, కోపం ఎక్కువవుతాయి.

గుండె సంబంధిత సమస్యలు.. నిద్ర లోపం దీర్ఘకాలంగా ఉంటే.. అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదం, స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

షుగర్, బరువు పెరగడం.. తక్కువ నిద్ర వల్ల ఇన్సులిన్ పనితీరు తగ్గుతుంది. ఆకలి పెంచే హార్మోన్లు ఎక్కువవుతాయి. ఊబకాయం (Obesity), టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. నిద్ర సరిపోకపోతే శరీరం వైరస్‌లు, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని కోల్పోతుంది. దీంతో తరచూ జలుబు, జ్వరం, అలసట లాంటివి వస్తుంటాయి.

జ్ఞాపకశక్తి, పనితీరు తగ్గడం.. తక్కువ నిద్ర ఏకాగ్రతను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి బలహీనమవుతుంది. పని లేదా చదువులో పని తీరు పడిపోతుంది.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రను అలవాటుగా మార్చుకుంటే.. అది నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీయవచ్చు. అందుకే నిద్రను లగ్జరీగా కాకుండా ఆరోగ్య అవసరంగా చూడాలని వారు సూచిస్తున్నారు.

మంచి నిద్ర కోసం వైద్యుల సూచనలు

రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం పడుకునే ముందు మొబైల్, టీవీ దూరంగా పెట్టడం కాఫీ, టీ రాత్రి వేళల్లో తగ్గించడం పడుకునే గదిలో వెలుతురు, శబ్దం తగ్గించడం రోజూ కొంత శారీరక వ్యాయామం చేయడం

రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం చిన్న విషయం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకుండా, ఆరోగ్యానికి అవసరమైనంత నిద్రను అలవాటు చేసుకోవడం చాలా అవసరం. మంచి నిద్ర.. మంచి ఆరోగ్యానికి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!
జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య..
జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య..
'ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్తే.. ఎక్కడో దొబ్బేశావ్ కదా అని అన్నారు'
'ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్తే.. ఎక్కడో దొబ్బేశావ్ కదా అని అన్నారు'