Sleeping Effects: ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్ర పోతున్నారా.. చాలా డేంజర్!
శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం. సరిగ్గా నిద్రపోతేనే శరీరం మళ్లీ యాక్టీవ్ అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే నిద్రతోనే సంగ రోగాలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి నిండా నిద్రపోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన విధంగా నిద్ర పోవడానికి కూడా సమయం ఉండటం లేదు. ఇలా కొంత మంది 5 లేదా ఆరు గంటలు మాత్రమే నిద్ర పోతూ ఉంటారు. ఇలా 7 ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే పలు దీర్ఘకాలిక అనారోగ్య..
శరీరానికి నిద్ర అనేది చాలా అవసరం. సరిగ్గా నిద్రపోతేనే శరీరం మళ్లీ యాక్టీవ్ అవుతుంది. అసలు నిజం చెప్పాలంటే నిద్రతోనే సంగ రోగాలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి నిండా నిద్రపోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన విధంగా నిద్ర పోవడానికి కూడా సమయం ఉండటం లేదు. ఇలా కొంత మంది 5 లేదా ఆరు గంటలు మాత్రమే నిద్ర పోతూ ఉంటారు. ఇలా 7 ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయన్న విషయం మీకు తెలుసా. మరి నిద్రలేమితో వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెమోరీ పవర్ తగ్గుతుంది:
శరీరానికి తగినంత నిద్ర లేకపోతే.. మెదడు సరిగ్గా పనిచేయదు. ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా అర్థంకాదు. ఇదే క్రమంలో మెమోరీ పవర్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా పని మీద శ్రద్ధ, ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గి పోతుంది. అందుకే కనీసం 7 గంటలైనా నిద్ర పోవాలని అంటున్నారు నిపుణులు.
రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది:
రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే రోగ నిరోధక శక్తి పై కూడా ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్ర పోవడం వల్ల మీ ఇమ్యూనిటీ కూడా తగ్గి పోతుంది. ఫలితంగా మీకు రోగాలు, అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు.
మానసిక సమస్యలు:
మీరు సరిగ్గా నిద్ర పోకపోతే.. తల నొప్పిగా ఉంటుంది. దీంతో చిరాకు కూడా కలుగుతుంది. అలాగే ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన ఆందోళన, నిరాశ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బరువు పెరుగుతారు:
సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ముందు మీ ఆకలి ఆర్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది. దీని వల్ల ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. అంతే కాకుండా రక రకాల ఆహారాలు తినాలని కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గుండె సంబంధిత వ్యాధులు:
నిద్ర లేమి కారణంగా గుండెపై కూడా ప్రభావం పడుతుంది. దీని వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.