Skin Care: శీతాకాలంలో చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి..

Skin Care Tips: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు, పలు రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఆరోగ్యంపై దృష్టిసారించకపోతే.. ఇబ్బందుల్లో పడటం తప్పదంటున్నారు

Skin Care: శీతాకాలంలో చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌తో చెక్ పెట్టండి..
Health Care
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 30, 2021 | 3:15 PM

Skin Care Tips: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు, పలు రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. ఆరోగ్యంపై దృష్టిసారించకపోతే.. ఇబ్బందుల్లో పడటం తప్పదంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా ఈ కాలంలో తినడం, తాగడం లాంటి హాబీలు పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు సైతం.. ఆహారం, పానీయాలు లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చలికాలంలో ఆరోగ్యంతో పాటు మన చర్మం ఎక్కువగా ప్రభావితం కావడానికి ఇదే కారణం. శీతాకాలంలో, మన చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోవడంతో గాలిలో తేమ తగ్గి మన చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల సమస్యలు ఏర్పడతాయి.

ఇలాంటి పరిస్థితిలో.. చలి కాలంలో చర్మాన్ని మంచిగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీని కోసం మీరు మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక విషయాలను చేర్చుకోవచ్చు. ఇది మీ చర్మం, ఆరోగ్యం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు శరీరాన్ని హైడ్రేషన్ నుండి రక్షించాలనుకుంటే.. మీరు ఆహారంలో కొన్ని పానీయాలను చేర్చుకోవాలి. అయితే వింటర్‌ సీజన్‌లో మీరు ఏ డ్రింక్స్‌ తీసుకుంటారనేది గమనించాల్సిన విషయం. కాబట్టి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయడంలో సహాయపడే కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

చర్మాన్ని తేమగా ఉంచడానికి ఈ డ్రింక్స్ తీసుకోండి: 1. ఉసిరి రసం చలికాలంలో ఉసిరి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉసిరి శీతాకాలం, వేసవి కాలం రెండింటిలోనూ తినదగిన ఒక సూపర్ ఫుడ్. వింటర్ సీజన్‌లో ఉసిరి రసం తాగితే.. అందులోని పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయ రసంలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

2. పసుపు పాలు చలికాలంలో పసుపు పాలు కూడా దివ్యౌషధంగా పనిచేస్తాయి. వాస్తవానికి, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక సీజన్‌లో చర్మాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఇది సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఖచ్చితంగా పసుపు పాలను తీసుకోవడం వేలని పేర్కొంటున్నారు.

3. గ్రీన్ టీ గ్రీన్ టీ ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఉత్తమమైన పానీయం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి.

Also Read:

Health Tips: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపించాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమే..!

Skin Care: శరీరంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!