AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter: సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోండి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, చర్మ వ్యాధులు ఇట్టే అంటుకుంటాయి. ఇవి సాధారణమైనవే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే న్యూమోనియా, బ్రాంకైటిస్, చెవి ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తాయి. ఇంట్లోనే చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను ఈ అంటు వ్యాధుల ..

Winter: సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోండి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Infectious Diseases For Kids
Nikhil
|

Updated on: Nov 21, 2025 | 10:32 AM

Share

చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, చర్మ వ్యాధులు ఇట్టే అంటుకుంటాయి. ఇవి సాధారణమైనవే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే న్యూమోనియా, బ్రాంకైటిస్, చెవి ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తాయి. ఇంట్లోనే చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను ఈ అంటు వ్యాధుల నుంచి 80-90% వరకు కాపాడుకోవచ్చు. సీజనల్​ వ్యాధులు, అంటు వ్యాధులు పిల్లలకు సంక్రమించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

ఇలా చేయండి..

* అంటు వ్యాధులను నివారించడానికి హ్యాండ్​ వాష్​ని మించిన మంత్రం లేదు! ఆడుకుని వచ్చాక, భోజనం చేసే ముందు, టాయిలెట్ వాడిన తర్వాత కనీసం 40-60 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. బయట ఉన్నప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ సానిటైజర్ (60% ఆల్కహాల్ ఉన్నది) ఉపయోగించండి.

* పిల్లలకు అన్ని రకాల టీకాలను తప్పనిసరిగా వేయించాలి. భారత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే BCG, DPT, మీజిల్స్-రూబెల్లా, పోలియో టీకాలతో పాటు, ప్రైవేట్‌లో ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. ఈ టీకాలు పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా 70-95% వరకు రక్షణ ఇస్తాయి.

* పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ముఖ్యం. విటమిన్ సి (నారింజ, కివీ, ఉసిరి), జింక్ (గింజలు, పప్పులు), విటమిన్ డి (సూర్యరశ్మి, గుడ్లు) రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ ఒక చెంచా అరటిపండు, తేనె కలిపి ఇస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి.

* ఇంటిని శుభ్రంగా ఉంచాలి. బొమ్మలు, డోర్ హ్యాండిల్స్, మొబైల్స్, రిమోట్స్ వంటివి వారానికి రెండుసార్లు డెటాల్ స్ప్రేతో తుడవాలి. పిల్లల దుప్పట్లు, దిండు కవర్లు వారానికి ఒకసారి వేడినీటితో ఉతకాలి.

* చలికాలంలో గదులు మూసి ఉంచుతారు కానీ, ఉదయం 9-11, సాయంత్రం 4-5 గంటలు కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడాలి. హ్యూమిడిఫైయర్ ఉపయోగిస్తే మంచిది, ఇది ఎండిపోయిన గొంతు, ముక్కు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జనసాంద్రత ఉన్న చోట్ల మాస్క్ ధరించాలి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలల్లో ఇతర పిల్లలు దగ్గుతుంటే N95 లేదా డబుల్ లేయర్ మాస్క్ ధరించడం మంచిది.

* 3 రోజులకు మించి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీలం రంగు పెదవులు, తీవ్రమైన దగ్గు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇంట్లో థర్మామీటర్, పల్స్ ఆక్సీమీటర్ ఉంచుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో పిల్లలు సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

Follow Us