AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..! టాబ్లెట్లు లేకుండానే నొప్పి నుంచి విముక్తి..!

తలనొప్పి వల్ల రోజంతా అసహనంగా అనిపించడమే కాకుండా పనులన్నీ నిలిచిపోతాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆకలి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వంటి కారణాలతో ఇది తలెత్తుతుంది. అయితే టాబ్లెట్లు వాడకుండా సహజమైన మార్గాల్లో తలనొప్పిని త్వరగా తగ్గించుకునే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

తలనొప్పి తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్ మీకోసం..! టాబ్లెట్లు లేకుండానే నొప్పి నుంచి విముక్తి..!
Headache
Prashanthi V
|

Updated on: Feb 20, 2025 | 9:43 PM

Share

తలనొప్పి అనేది చిన్న సమస్యగా అనిపించినా ఒకసారి వస్తే రోజంతా అసహనంగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సేపు మొబైల్ లేదా టీవీ చూడటం, ఆకలికి తినకపోవడం వంటి కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. టాబ్లెట్లు వాడకుండానే సహజమైన మార్గాల్లో తలనొప్పిని తగ్గించుకునే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

తలనొప్పికి కారణాలు

  • ఒత్తిడి, ఆందోళన
  • శరీరంలో నీటి లేమి
  • నిద్ర పోకపోవడం
  • ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం
  • ఆకలికి తినకపోవడం
  • గట్టిగా శబ్దాలు, కాంతి ప్రభావం
  • మైగ్రేన్ లేదా సైనస్ సమస్యలు

తలనొప్పికి ఐస్ క్యూబ్స్

తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే టాబ్లెట్లు వేసుకోకుండా ఇంట్లోనే సహజమైన చికిత్సను ప్రయత్నించొచ్చు. రెండు ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటిని ఒక చిన్న ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బొటనవేళ్లను ఈ ఐస్ ముక్కలపై ఉంచి కాసేపు అయ్యాక తీసి మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేస్తే తలనొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తుంది..?

మన బొటనవేళ్ల నరాలు నేరుగా తల నరాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఐస్ చల్లదనంతో నరాల ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగవడంతో తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా సహజమైన చికిత్స కనుక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర సహజమైన మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • నీరు ఎక్కువగా తాగండి.. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • నెమ్మదిగా శ్వాస తీసుకోవడం.. దీని ద్వారా ఒత్తిడి తగ్గి తలనొప్పి తగ్గుతుంది.
  • స్వల్పమైన యోగా, మసాజ్.. మెడ, తల ప్రాంతాలను మెల్లగా మర్దన చేయడం ఉపశమనం కలిగిస్తుంది.
  • పుదీనా లేదా జింజర్ టీ తాగడం.. సహజమైన నొప్పి నివారణ కోసం ఇవి ఉపయోగపడతాయి.

ఈ చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. మీకు తలనొప్పి అనిపించినప్పుడు ఒకసారి ఐస్ మసాజ్ ప్రయత్నించి చూడండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)