AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పొరపాట్లు చేయకండి..! ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసా..?

బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజు మొత్తం శరీరానికి అవసరమైన ఎనర్జీని అందించే ముఖ్యమైన భోజనం. ఇది మెటబాలిజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది. కానీ చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించి బరువు పెరగడం, బ్లడ్ షుగర్ పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ విషయంలో చేయకూడని పొరపాట్లను తెలుసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పొరపాట్లు చేయకండి..! ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసా..?
Healthy Breakfast
Prashanthi V
|

Updated on: Feb 20, 2025 | 10:10 PM

Share

కొంత మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నామనే కారణంతో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిల్లో మార్పులు ఏర్పడి మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీని బదులుగా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌లో డోనట్స్, చాక్లెట్ స్ప్రెడ్స్, చక్కెర ఎక్కువగా ఉండేవి తీసుకోవడం చాలా మందికి అలవాటు. ఇవి త్వరగా జీర్ణమై మళ్లీ ఆకలి వేయిస్తాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బదులుగా గుడ్లు, గ్రీక్ యోగర్ట్, మల్టీగ్రెయిన్ టోస్ట్ వంటి హెల్దీ ఆహారం తీసుకోవాలి.

ఫైబర్ లేని ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌లో అనియంత్రిత మార్పులకు దారి తీస్తుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పండ్లు, కూరగాయలు లాంటి హై ఫైబర్ ఆహారం తీసుకోవాలి.

తాజా పండ్ల జ్యూస్ ఆరోగ్యకరంగా అనిపించినా అందులో ఫైబర్ శాతం తక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పండ్లను నేరుగా తినడం ఉత్తమం.

ఉదయాన్నే ప్రోటీన్ తినకపోతే బరువు తగ్గే ప్రాసెస్ మందగిస్తుంది. గుడ్లు, ప్రోటీన్ స్మూతీస్, నట్ బటర్, లీన్ ప్రోటీన్ కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.

చాలా మంది ఉదయాన్నే కేవలం టీ లేదా కాఫీ తాగి బ్రేక్‌ఫాస్ట్ మానేస్తారు. దీని వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రిషన్ అందదు. బదులుగా గ్రీన్ టీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లేదా న్యూట్రిషియస్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మంచిది.

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్

  • ఉడికించిన గుడ్లు, మల్టీగ్రెయిన్ బ్రెడ్, అవకాడో
  • గ్రీక్ యోగర్ట్, చియా సీడ్స్, తేనె
  • ఓట్స్, నట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్
  • స్మూతీ బౌల్ (అవకాడో, బాదం పాలు, ఫ్రూట్స్)

ఈ పొరపాట్లు వద్దు

  • బ్రేక్‌ఫాస్ట్ పూర్తిగా మానేయడం
  • ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం
  • అధిక షుగర్ ఉన్నవి తినడం
  • కేవలం కాఫీ తాగి వదిలేయడం

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!