Star Fruit: స్టార్ ఫ్రూట్స్ తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే చిన్న ముక్క కూడా వదిలిపెట్టరండోయ్..
నక్షత్ర ఆకారంలో ఉండి, పసుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే స్టార్ ఫ్రూట్..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..స్టార్‌ఫ్రూట్ ఆరోగ్యపరంగా మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. స్టార్ ఫ్రూట్ రుచిలో తియ్యగా ఉండి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే, ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా అధిక బరువును తగ్గిస్తుంది.. కాబట్టి బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపిక అని చెబుతున్నారు.
Updated on: Feb 20, 2025 | 9:34 PM

స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ బి6 శరీరమెటబాలిజంనుపెంచుతుంది. అందువల్ల క్యాలరీలు వేగంగా ఖర్చై కొవ్వు కరిగిపోతుంది. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగలకుండా ఉంటుంది. 100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో సుమారు 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్,అసిడిటీ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది.

స్టార్‌ఫ్రూట్ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త నాళాల్లోని అడ్డంకులను ,హైబీపీ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ర్ట్ ఎటాక్ రాకుండా చూడటానికి సహాయం చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది. మెడ, భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తితో పాటుగా పాటు కళ్ళను కూడా సంరక్షిస్తుంది. కంటి చూపు మెరుగు పడటానికి సహాయం చేస్తుంది. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కళ్లలో శుక్లాలు రాకుండా చేస్తుంది.

కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది. మిమ్మల్నీ ఉత్సాహంగా ఉంచుతుంది.




