AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులిచింత ఆకులో దాగివున్న ప్రయోజనాలు తెలుసా..? ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..!

Pulichinta Leaves: మన ప్రకృతిలో ఉండే ఎన్నో మొక్కలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి ఔషధ మూలికే పులి చింత కూడా. వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. మన ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీల్లోనూ ఈ మొక్క పెరిగి నిండుగా పాకుతుంది. ఈ ఆకులను పప్పు, పులుసు కూర వండుకుని తింటారు.. పులి చింత ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Feb 20, 2025 | 8:59 PM

Share
ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి. అందుకే వీటికి పులి చింత అని పేరు. ఈ పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది. గొంతు సంబంధిత రోగాలను అరికడుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.

1 / 5
పులి చింత ఆకులను పప్పుగా వండుకొని తింటే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. వాతం తగ్గిస్తుంది. ఈ ఆకులను, సొంటి, నెయ్యి, తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది.

2 / 5
ఆహారంలో పులి చింతను చేర్చుకోవటం వల్ల నిద్రలేమికి మేలు చేస్తుంది. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు గట్టిపడతాయి. పులిచింత మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

3 / 5
సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది. పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది.

4 / 5
40 నుంచి 60 మి.లీ పులి చింతల ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. ఈ ఆకులను కూరగా, పచ్చడిగా వండుకుని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.

5 / 5