AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..! ఈ అలవాటును మానుకోండి

మన రోజువారీ ఆహారంలో ఉప్పు ప్రధానమైన భాగం. కానీ ఈ ఉప్పును కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల్లో కలిపినప్పుడు అది శరీరానికి హాని చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరుగులో ఉప్పు కలిపి తినడాన్ని చాలా మంది సాధారణంగా చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా అన్న విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..! ఈ అలవాటును మానుకోండి
Salt
Prashanthi V
|

Updated on: Apr 22, 2025 | 12:07 PM

Share

పెరుగు ఓ సహజ ప్రొబయోటిక్. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరిచే బ్యాక్టీరియాను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీనిలో ఉప్పు కలిపినప్పుడు.. పెరుగులో ఉన్న ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్యాక్టీరియా ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాదు ఉప్పు వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి హై బిపి, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పాలు, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తుల్లో ఉప్పు కలపడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కలయిక వల్ల జుట్టు అధికంగా రాలడం, తెల్లజుట్టు ఏర్పడటం, చర్మ సమస్యలు కలగడం వంటి దుష్పరిణామాలు వస్తాయి. కొంతకాలం పాటు ఇలా తినడం శరీరంలో విషతుల్య రసాయనాలుగా మారే ప్రమాదం కూడా ఉంది.

కొంతమంది పండ్ల రుచిని పెంచేందుకు.. దాన్ని తీపికి వ్యతిరేకంగా సమతుల్యం చేసేందుకు ఉప్పును ఉపయోగిస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఎందుకంటే ఫలాల్లో సహజంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు ఉప్పుతో కలిసినప్పుడు దెబ్బతింటాయి. దీని ప్రభావంగా శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. ఎక్కువగా ఇలా తినడం వల్ల డీహైడ్రేషన్, శరీర వాపు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

సలాడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిలో అధికంగా ఉప్పు కలపడం శరీరంలో సోడియం స్థాయిని పెంచి రక్తపోటు లాంటి సమస్యలను పెంచుతుంది. శరీరంలో నీరు నిల్వ కావడం, వేళ్ల వాపు, గుండెపై ఒత్తిడి వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

వీటికి తోడు, జ్యూసుల్లో ఉప్పు కలపడం అలవాటుగా చేసుకుంటే అది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. ఉదాహరణకు టొమాటో జ్యూస్ లేదా వెజిటేబుల్ డ్రింక్స్‌లో ఉప్పు కలిపినప్పుడు.. జీర్ణవ్యవస్థ బలహీనంగా మారి, గ్యాస్, అసిడిటీ వంటి ఇబ్బందులు కలగొచ్చు. అంతేకాదు మలబద్ధకం సమస్యలు కూడా ఉప్పు మోతాదు అధికంగా తీసుకున్నప్పుడు ఎదురవుతాయి.

ఉప్పు శరీరానికి అవసరమైనదే. కానీ దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాల్లో కలపకూడదో తెలుసుకోవడం ఎంతో అవసరం. పెరుగు, పండ్లు, సలాడ్లు, జ్యూసులు వంటి ఆహారాల్లో ఉప్పు కలపడం వల్ల శరీరానికి అనేక రకాల హానికరమైన ఫలితాలు వస్తాయి. కనుక వీటిని తినేటప్పుడు ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఏపీలోని రైతులకు రేపట్నుంచి కొత్త కార్యక్రమం.. అవి ఫ్రీనే..
ఏపీలోని రైతులకు రేపట్నుంచి కొత్త కార్యక్రమం.. అవి ఫ్రీనే..
51 ఏళ్ల వయసులో తరగని అందం.. ఒకప్పటి కుర్రాళ్ల రాకుమారిని చూశారా.
51 ఏళ్ల వయసులో తరగని అందం.. ఒకప్పటి కుర్రాళ్ల రాకుమారిని చూశారా.
అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!
అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!
449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?
449 ప్లాన్: జియో కంటే ఎయిర్‌టెల్ బెటర్.. ఎందుకో తెలుసా?
భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం.. డేట్ ప్రకటించిన రైల్వేశాఖ
భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం.. డేట్ ప్రకటించిన రైల్వేశాఖ
ఐటీ జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఐటీ జాబ్ మానేసి సినిమాల్లోకి.. ఇప్పుడేం చేస్తుందంటే..
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సిగరెట్లు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేంద్రం కొత్త నిర్ణయం
సిగరెట్లు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేంద్రం కొత్త నిర్ణయం
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇదే..
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇదే..
Viral Video: తన బట్టతలనే ఆక్వేరియంలా మార్చేసిన తాత!
Viral Video: తన బట్టతలనే ఆక్వేరియంలా మార్చేసిన తాత!