Urine Infection: యూరిన్ ను ఆపుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త

|

Jul 26, 2023 | 2:48 PM

బయటకు వెళ్లినప్పుడో లేక ఏదో పని మీద ఉన్నప్పుడో యూరిన్ వస్తున్నా వెళ్లకుండా కొంతమంది ఆపుకుంటూ ఉంటారు. మరికొంతమంది నిద్రలో మూత్రం వస్తే లేచేందుకు బద్ధకిస్తారు. అలానే పడుకుంటారు. అయితే ఇలా మూత్రం వచ్చినా వెళ్లకుండా ఆపుకుంటే చాలా సమస్యలు..

Urine Infection: యూరిన్ ను ఆపుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
Urin Infections
Follow us on

బయటకు వెళ్లినప్పుడో లేక ఏదో పని మీద ఉన్నప్పుడో యూరిన్ వస్తున్నా వెళ్లకుండా కొంతమంది ఆపుకుంటూ ఉంటారు. మరికొంతమంది నిద్రలో మూత్రం వస్తే లేచేందుకు బద్ధకిస్తారు. అలానే పడుకుంటారు. అయితే ఇలా మూత్రం వచ్చినా వెళ్లకుండా ఆపుకుంటే చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ తర్వాత పలు సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్‌ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి.. దీంతో బ్లాడర్‌ పరిమాణం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకొంటే పరవాలేదు కానీ..తరచూ ఆపుతుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణుల హెచ్చరిస్తున్నారు.

యూరిన్ ఇన్ఫెక్షన్:

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం ద్వారా ముందు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంది. మూత్రాశయం బాగా సాగితే విసర్జన సమయంలో పూర్తిగా ఖాళీ అవ్వదు. దీంతో లోపల హానికారక బ్యాక్టీరియా పెరగటానికి వీలు కల్పిస్తుంది. ఇలా తరచూ ఇన్ ఫెక్షన్లు తలెత్తవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా బాధకలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒక్కసారి వస్తే.. మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

యూరిన్ ఎక్కవ సేపు ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది. ఇదికాస్తా యూరిన్ లీక్ అవడానికి కారణమవుతుంది. ఇది చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితికి దారితీయవచ్చు. కొందరికి దగ్గినా, తుమ్మినా దుస్తుల్లోనే మూత్రం పడొచ్చు.

కిడ్నీలో రాళ్లు:

మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లుపడే అవకాశం కూడా ఉంది. ఆపి ఉంచితే మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారతాయి. ఇవే రాళ్లుగా మారతాయి. ఇదే పద్దతి కొనసాగిస్తూ ఉంటే.. అవి ఇంకా బంకగా మారి.. మరింత పెద్ద రాళ్లుగా మారుతాయి. అంతేకాకుండా దీని వల్ల కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అధిక నొప్పి:

యూరిన్ ఎక్కువ సేపు ఆపి ఉంచడం ద్వారా తీవ్రమైన నొప్పి వస్తుంది. మూత్రం ఆపుకుంటే కండరాలు ఓవర్ టైమ్ లో పని చేయాలి. మూత్రాన్ని ఆపినప్పుడు కండరాలు బిగుతుగా మారిపోతాయి. అంతేకాకుండా మూత్రాశయం సాగిపోతుంది. మూత్రాన్ని ఆపుకుంటూ నిరంత‌రం మూత్రాశయాన్ని సాగదీయడం వల్ల చివరికి అది య‌ధాస్థానానికి రాలేదు. దీంతో తీవ్ర‌మైన నొప్పి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి