Yoga: మహిళల కోసం ప్రత్యేక ఆసనాలు.. నెలసరి సమయంలో ఇవి చేస్తే నొప్పి నుంచి ఉపశమనం..
Yoga: మహిళలు సాధారణ సమయాల్లో ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికి.. నెలసరి సమయాల్లో చిరాకుగా, విసుగ్గా ఉంటారు. దీనికి తీవ్రమైన పెయిన్ కారణం కావచ్చు. సాధారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈసమస్యలు మరింత ఎక్కువుగా ఉంటాయి. నెలసరి సమయాల్లో మహిళలు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు దోహదపడతాయి. స్త్రీలు శారీకకంగా ధృడంగా ఉండటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు యోగా చేయడం వల్ల యాక్టివ్ గా ఉండవచ్చు. తనువు మనసు ఆత్మను ఏకం చేసే […]
Yoga: మహిళలు సాధారణ సమయాల్లో ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికి.. నెలసరి సమయాల్లో చిరాకుగా, విసుగ్గా ఉంటారు. దీనికి తీవ్రమైన పెయిన్ కారణం కావచ్చు. సాధారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈసమస్యలు మరింత ఎక్కువుగా ఉంటాయి. నెలసరి సమయాల్లో మహిళలు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు దోహదపడతాయి. స్త్రీలు శారీకకంగా ధృడంగా ఉండటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు యోగా చేయడం వల్ల యాక్టివ్ గా ఉండవచ్చు. తనువు మనసు ఆత్మను ఏకం చేసే సాధనం యోగ. మనిషిని సమతుల్యంగా ఉంచడంలో యోగాసనాలు దోహదపడతాయి. అంతర్గత బలాన్ని పెంపొందిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో యోగా భంగిమలు ఉపయోగపడుతాయి. పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పి స్త్రీల రోజువారి దిన చర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రుతుస్రావంలో పొత్తికడుపులో నొప్పి, అధిక రక్త స్రావం వంటి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈపెయిన్స్ నుంచి యోగాసనాలు ఉపశమనం కల్పిస్తాయి.
మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి ఎటువంటి యోగసనాలు చేయాలో తెలుసుకుందాం.
ధనురాసనం: ఈ ఆసనం పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజపరుస్తుంది, తిమ్మిరిని తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. స్త్రీలు తప్పనిసరిగా చేయాల్సిన ఆసనాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
మత్స్యసనం: థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధుల పనితీరును ఈ ఆసనం నియంత్రిస్తుంది, ఛాతీని తెరుస్తుంది, లోతైన శ్వాసకు సహకరిస్తుంది. వెన్నెముకను బలపరుస్తుంది. పీరియడ్ క్రాంప్‌లను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈఆసనం చేయడం ద్వారా నెలసరి సమయంలో పెయిన్ ను నివారించవచ్చు.
ఉపవిష్ట కోనాసనం: ఈ ఆసనం ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది పూర్తి విశ్రాంతికి సహాయపడుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది.
సేతు బంధాసనం: ఈ ఆసనం వెనుక కండరాలు, కోర్, గ్లూట్‌ను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈఆసనం వెన్నునొప్పిని నివారిస్తుంది. మూత్రపిండాలకు శక్తినిస్తుంది, ఋతు తిమ్మిరిని తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా సహాయపడుతుంది. శరీరంలో రక్తపోటును నియంత్రిస్తుంది.
జాను సిర్ససానం: ఈ ఆసనం ఉదర కండరాలను టోన్ చేస్తుంది, అంతర్గత అవయవాలను ఒత్తిడి కలిగేలా చేస్తుంది, వెన్నెముక, భుజాలు హామ్ స్ట్రింగ్స్‌ను రిలాక్స్ చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
మహిళలు వారి ఆరోగ్య సామార్థ్యాన్ని బట్టి ఈయోగసనాలు చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా మహిళలు పైన పేర్కొన ఆసనాలు చేస్తే నెలసరి సమయంలోనూ వారు యాక్టివ్ గా విసుగు లేకుండా ఉండవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి