AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీర క్యాన్సర్‌కు కారణమవుతోందా..? భారతీయ మహిళల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా.. వైద్యులు ఏమంటున్నారంటే

ముంబైలోని ఆర్‌ఎన్ కూపర్ హాస్పిటల్‌లో 68 ఏళ్ల మహిళకు ఇటీవల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చాలా ఆందోళన కలిగించింది . ఇంతకీ చీర క్యాన్సర్ అంటే ఏమిటి? చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? చీరలకు క్యాన్సర్‌కి సంబంధం ఏమిటి? అటువంటి చాలా గందరగోళ ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు తెలుసుకుందాం.. చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది చీర ధరించే స్త్రీలలో నడుము పొడవునా వస్తుంది. చీర కట్టుకునే వారికే కాదు బిగుతుగా ఉండే బట్టలు ధరించే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

చీర క్యాన్సర్‌కు కారణమవుతోందా..? భారతీయ మహిళల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా.. వైద్యులు ఏమంటున్నారంటే
Indian Women In Sarees
Surya Kala
|

Updated on: Apr 04, 2024 | 1:45 PM

Share

భారతీయులను ప్రపంచంలో భిన్నంగా చూపించేది సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు అని చెప్పవచ్చు. భారతీయ స్త్రీత్వానికి అత్యుత్తమ చిహ్నం చీర. భారతీయ మహిళల వస్త్రధారణలో అత్యధిక భాగాన్ని ఆక్రమించిన చీర ఐదున్నర నుండి ఆరు మీటర్ల వరకు విస్తరించి ఉన్న ఒక అందమైన వస్త్రం.. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైనది. కొత్త ట్రెండీ బట్టలు ఎన్ని వచ్చినా.. చీరలకు ఉన్న గిరాకీ ఏ మాత్రం తగ్గలేదు. పండగలు, పర్వదినాలు వస్తే చాలు మగువ మనసు చీరనే కోరుకుంటుంది. అయితే చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయట. ముంబైలోని ఆర్‌ఎన్ కూపర్ హాస్పిటల్‌లో 68 ఏళ్ల మహిళకు ఇటీవల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చాలా ఆందోళన కలిగించింది . ఇంతకీ చీర క్యాన్సర్ అంటే ఏమిటి? చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? చీరలకు క్యాన్సర్‌కి సంబంధం ఏమిటి? అటువంటి చాలా గందరగోళ ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు తెలుసుకుందాం..

చీర క్యాన్సర్ అంటే ఏమిటి?

చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది చీర ధరించే స్త్రీలలో నడుము పొడవునా వస్తుంది. చీర కట్టుకునే వారికే కాదు బిగుతుగా ఉండే బట్టలు ధరించే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చీర కట్టుకునే ముందు లోపల లంగా ధరిస్తారు. ఎక్కువ సేపు నడుము చుట్టూ లంగాను గట్టిగా ధరించడం వల్ల అరుదైన స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిఎన్‌ఎకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీలోని పిఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రి క్యాన్సర్ విభాగానికి చెందిన డాక్టర్ వివేక్ గుప్తా చెప్పిన ప్రకారం, “భారతదేశంలో, సంవత్సరాలుగా చీరలు ధరించే మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైట్ గా లంగా వేసుకోవడం వలన నడుము భాగంలో దురద మొదలై.. రోజు గడుస్తున్న కొద్దీ నడుము చుట్టూ ఉన్న చర్మం ఊడిపోవడం మొదలవుతుంది. ఈ లక్షణాలను నార్మల్ గా పట్టించుకోకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

చీర క్యాన్సర్ వ్యాప్తికి వస్త్రం కంటే పరిశుభ్రత పద్ధతులే ఎక్కువగా కారణమని చెప్పవచ్చు. బీహార్, జార్ఖండ్ వంటి అధిక ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు ఉన్న ప్రాంతాలు ఈ క్యాన్సర్ సంభవనీయత ఎక్కువ అని చెబుతున్నారు. భారతీయ మహిళల్లో 1 శాతం ఈ చీర క్యాన్సర్ ఉన్నాయి. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ వంటి సంస్థలలో ఇప్పటికే పరిశోధనలను జరుపుతున్నారు.

అదేవిధంగా చాలా టైట్ ఫిట్ జీన్స్ పురుషుల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. నిజానికి గంటల తరబడి చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పరిశోధన ప్రకారం జీన్స్ పురుషులలో పొత్తికడుపు కింది భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుందని.. ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గించి వృషణాల క్యాన్సర్ (టెస్టిక్యూలర్ క్యాన్సర్)కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

చీరల వంటి సాంప్రదాయ వస్త్రధారణ , సాంస్కృతిక పద్ధతులు సౌకర్యాన్ని , సౌందర్యాన్ని,  ఆకర్షణను అందిస్తాయి. అయితే అందమైన దుస్తుల ఎంపికలతో పాటు ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన కూడా అవసరం అని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!