AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lychee Side Effects: జర జాగ్రత్త.. సరిగా పండని లీచీ తింటే ఏమౌతుందో తెలుసా..?

వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే పండ్లలో లీచీకి మంచి పేరుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి శరీరానికి శక్తినిస్తాయి. అయితే ఏ ఆహార పదార్థమైనా ఎక్కువ తింటే హానికరంగా మారొచ్చు. అలాగే లీచీ పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనవసరమైన ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా వేసవిలో, జాగ్రత్త లేకుండా తింటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు.

Lychee Side Effects: జర జాగ్రత్త.. సరిగా పండని లీచీ తింటే ఏమౌతుందో తెలుసా..?
Lychee
Prashanthi V
|

Updated on: May 20, 2025 | 5:24 PM

Share

సరిగా పండని లీచీ పండ్లను తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కసారిగా బలహీనత, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది హైపోగ్లైసీమియాకు దారి తీసి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.

కొంతమందికి లీచీ పండ్లు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట లాంటివి రావొచ్చు. ఇది ఆ వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఇది శ్వాసకోశ సమస్యలుగా కూడా మారే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో వెంటనే డాక్టర్‌ను కలవడం అవసరం.

ఈ పండ్లను ఎక్కువగా తింటే కొందరికి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. లీచీలో ఉండే చక్కెరలు, ఫైబర్ పదార్థాలు కొన్నిసార్లు జీర్ణక్రియపై ఒత్తిడిని పెంచొచ్చు. వేసవిలో శరీరానికి చల్లదనం అవసరమే అయినా.. సరైన మోతాదులో ఈ పండ్లను తీసుకోకపోతే సమస్యలు వస్తాయి.

మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నవారు లీచీ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తంలోని షుగర్ లెవల్స్‌ ను ప్రభావితం చేయొచ్చు. కొన్ని మందుల పని తీరును కూడా తగ్గించొచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని మరింత మందగించడంతో పాటు పరిస్థితిని విషమంగా మార్చే ప్రమాదం కూడా ఉంది.

లీచీ పండ్లను అధికంగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో శరీర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరం తనను తాను ప్రతికూలంగా ఎదుర్కొనే ఆటో ఇమ్యూన్ సమస్యలు రావొచ్చు. ఈ పరిస్థితి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం కలిగిస్తుంది.

లీచీ పండ్లు సహజంగా శరీరానికి మంచివే అయినా.. వాటిని సమతుల్యంగా, తక్కువ మోతాదులో తీసుకోవడమే ఉత్తమం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, చిన్నపిల్లలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇవి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ ను సంప్రదించడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్