ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వాళ్లు గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. గుండెపోటు రావడానికి కొలెస్ట్రాల్, ధుమపానం, మద్యపానం కారణాలని మనకు తెలుసు. అయితే.. గుండెపోటుకు భారీ శబ్ధాలు కూడా కారణమవుతాయని మీకు తెలుసా.? యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు 500 మంది ఆరోగ్యకరమైన పెద్దలను పరిగణలోకి తీసుకున్నారు. వీరంతా బహిరంగ ప్రదేశాల్లో తరచుగా లౌడ్ మ్యూజిక్‌కు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయయనంలో హృద్రోగ లక్షణాలు లేనివారు కూడా కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు గురైనట్టుగా తేలింది. స్థాయికి మించిన శబ్ధాలకు ఎక్స్‌పోజ్ అయిన వారిలో హృద్రోగాల ముప్పు 34 శాతం పెరుగుతుందిన అధ్యయనంలో తేలింది.
జర్మనీలోని మైంజ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ 15,000 మందిపై చేపట్టిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. నిత్యం భారీ శబ్ధాల మధ్య ఉండే వారి గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుందని పరిశోధకులు చెబుతున్నారు. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకునే అర్టియల్ ఫిబ్రిలేషన్‌తో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, రక్తనాళాల్లో పూడికల వంటి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 50-70 డెసిబల్స్‌కు మించిన శబ్ధాలు గుండె, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..