Air pollution: వాయు కాలుష్యంతో ఆ సమస్య కూడా.. తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
ఇదిలా ఉంటే వాయు కాలుష్యం డయాబెటిస్‌కు కూడా కారణమవుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ, చెన్నైలలో నిర్వహించిన పలు అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను బీఎమ్‌జే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు...

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతోన్న ఇంధన వాడకం, పరిశ్రమల వల్ల కాలుష్యం భారీగా పెరుగుతోంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అలర్జీలు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే వాయు కాలుష్యం డయాబెటిస్‌కు కూడా కారణమవుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. వాయు కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ, చెన్నైలలో నిర్వహించిన పలు అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను బీఎమ్‌జే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
గాలిలో పీఎం స్థాయి 2.5 స్థాయి కంటే పెరగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతోందని తేలింది. ఈ పరిశోధనను 2010లో ప్రారంభించారు. కాలుష్యానికి, మధుమేహానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించిన తొలి అధ్యయనం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం భారత్‌లో సుమారు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరిగింది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఒమత్తం 12 వేల మందిని పరిగణలోకి తీసుకున్నారు. అనంతరం వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేశారు. అదే విధంగా వారు నివిస్తున్న ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రతను పరిశీలించారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లు ఇందులో తేలింది. ఎక్కువ కాలంపాటు వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 20 నుంచి 22 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భారత్‌లో రోజురోజుకీ డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతుండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది తీసుకునే ఆహారం సరైంది కాకపోవడమే. అస్తవ్యస్తమైన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇక టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వారే అధికంగా ఉండడం ఆందోళనకరం. వాయు కాలుష్యం కూడా డయాబెటిస్‌కు కారణమని తేలడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆహారంలో మైదా, చక్కెరలను తగ్గిస్తూ.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..