Headache Remedies: తలనొప్పిగా ఉందా!! ఈ సారి ఇలా చేయండి.. చిటికెలో మాయం
కొంతమందికి అదే పనిగా తలనొప్పి వస్తూంటుంది. తలనొప్పికి ఒకటి అంటూ కారణం ఉండదు. పని ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్, జన్యుపరమైన సమ్యలు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి..

కొంతమందికి అదే పనిగా తలనొప్పి వస్తూంటుంది. తలనొప్పికి ఒకటి అంటూ కారణం ఉండదు. పని ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్, జన్యుపరమైన సమ్యలు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా అవుతాయి. అయితే తలనొప్పికి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా.. ప్రమాదం ఉందండోయ్. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఓసారి చూసేద్దాం.
తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తలనొప్పిగా అనిపిస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగడం ఉత్తమం. గంధాన్ని నుదుటిపై రాసినా ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే చక్కటి రిలీఫ్ వస్తుంది.
పంటినొప్పి, కంటి నొప్పి ఉన్నా కూడా అది తలనొప్పికి దారి తీస్తుంది. ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని.. బ్రీథింగ్ వర్కౌట్స్ చేసినా కూడా చాలా మంచిది. ఇది తలకు ఆక్సిజన్ ని అందించి సహాయం చేస్తోంది.




మెదడుకి సంబంధించిన నరాలు చెవి ప్రాంతాన్ని కలిపి ఉంటాయి. చెవి వెనుక భాగంలో కాస్త మస్తాజ్ చేసి, కిందికి పైకి కొద్దిగా లాగడం మంచిది. నుదురు, తలపై మసాజ్ చేసుకోవడం, నాసికా రంధ్రాలపై నుంచి కింది దాకా మసాజ్ చేయడం, ఐస్ తో కూడా నుదుటిపై మసాజ్ చేసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…