Diabetes: డయాబెటిక్ రోగులు సైక్లింగ్ చేస్తే మరణాన్ని జయించినట్లే.. అధ్యాయనాల్లో సంచలన విషయాలు..
డయాబెటిక్ రోగులకు సైక్లింగ్ వలన అనేక ప్రయోజనాలున్నాయి. సైక్లింగ్ వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. బలహీనత తగ్గుతుంది.
డయాబెటిక్ రోగులకు సైక్లింగ్ వలన అనేక ప్రయోజనాలున్నాయి. సైక్లింగ్ వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. బలహీనత తగ్గుతుంది. కాళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ సైక్లింగ్ చేయడం వలన ఫలితం కనిపిస్తుంది. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుందని గుర్తు పెట్టుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటూ సైక్లింగ్ వల్ల ఒత్తిడి తగ్గి బాగా ఫోకస్ చేయగలుగుతారు. నిజానికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా మెంటల్ హెల్త్ కి కూడా తోడ్పడుతుంది. సైక్లింగ్ కూడా అలాంటిదే. రోజూ ఓ అరగంట సైక్లింగ్ చేయడం వలన స్థూలకాయం తగ్గించడం, వెయిట్ లాస్ మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
జామా ఇంటర్నేషనల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం డయాబెటిస్‌ను సైక్లింగ్ ద్వారా చాలా వరకు నియంత్రించవచ్చని వెల్లడైంది. దీంతోపాటు ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కూడా మెరుగ్గా సహాయపడుతుంది. పరిశోధన కోసం పరిశోధకుడు మాథియాస్ రైడ్-లార్సెన్ బృందం 1992 నుంచి సంవత్సరం వరకు 55 నుండి 56 సంవత్సరాల వయస్సు గల 7459 మంది డయాబెటిక్ పెద్దల ఆరోగ్య డేటాను అధ్యయనం చేశారు. సోషియోడెమోగ్రాఫిక్ 2000లో 10 పశ్చిమ ఐరోపా దేశాలలో జీవనశైలిని అనుసరించి ఈ అధ్యాయనం నిర్వహించారు.
ఈ పరిశోధనకు సంబంధించిన సమాచారం ప్రకారం ఆ వ్యక్తుల 5 సంవత్సరాల ఆరోగ్య తనిఖీ తర్వాత నిర్వహించిన సర్వేలో మధుమేహంతో బాధపడుతున్న 7459 మందిలో 5423 మంది మాత్రమే ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ప్రాథమిక విశ్లేషణ చివరి అప్ డేట్‌ను నవంబర్ 13, 2020న నిర్వహించారు. అయితే ఈ పరిశోధన ముగిసే సమయానికి 1600 మందికి పైగా మరణించారు.
EPIC పరిశోధకుల ప్రకారం 5 సంవత్సరాలకు పైగా రెగ్యులర్ సైక్లింగ్ చేస్తున్న వ్యక్తులు వారి అకాల మరణం ప్రమాదం 35 శాతం తగ్గింది. ఈ సమన్వయ అధ్యయనంలో సైక్లింగ్ చేయని వారితో పోలిస్తే నిరంతరం సైకిల్ తొక్కే వ్యక్తుల మరణ ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేలీంది.
Also Read: Goa Beach: గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. హత్యేనంటున్న కుటుంబీకులు, మహిళా సంఘాలు
Prakash Raj: జిమ్‌లో మెగాస్టార్‌ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..