New Year Hangover: న్యూ ఇయర్ హ్యాంగోవరా.. ఇంటి చిట్కాలు చెక్ పెట్టండిలా!

దాదాపు అన్ని వంటల్లో అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లంలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే పెద్దలు అన్ని వంటల్లో అల్లాన్ని ఉపయోగించేలా చేశారు. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును సమర్థవంతంగా కరిగించడానికి సహాయ పడతాయి. హ్యాంగోవర్ ఎక్కువగా ఉంటే.. అల్లం టీ తాగితే బెటర్. లేదా అల్లం ముక్కను అయినా నోట్లో వేసుకుని నములుతూ ఉండాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు..

New Year Hangover: న్యూ ఇయర్ హ్యాంగోవరా.. ఇంటి చిట్కాలు చెక్ పెట్టండిలా!
Hangover

Edited By:

Updated on: Dec 31, 2023 | 7:07 PM

న్యూ ఇయర్ వచ్చిందంటే.. కుటుంబ సభ్యులు, స్నేహితులు బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. ఈ క్రమంలో కొందరు ఎక్కువగా మద్యం తాగుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలు మాత్రం భయంకరంగా ఉంటుంది. న్యూ ఇయర్ మత్తు దిగక.. ఉదయం లేవలేక తల నొప్పితో ఇబ్బందిగా ఉంటుంది. ఈ సారి ఇలా జరగకూడదంటే.. కొన్ని ఇంటి టిప్స్‌ పాటించండి. అవేంటో ఒక లుక్ వేసేయండి.

అల్లం:

దాదాపు అన్ని వంటల్లో అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లంలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే పెద్దలు అన్ని వంటల్లో అల్లాన్ని ఉపయోగించేలా చేశారు. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును సమర్థవంతంగా కరిగించడానికి సహాయ పడతాయి. హ్యాంగోవర్ ఎక్కువగా ఉంటే.. అల్లం టీ తాగితే బెటర్. లేదా అల్లం ముక్కను అయినా నోట్లో వేసుకుని నములుతూ ఉండాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది అల్లం.

పుదీనా:

పుదీనా అనేది మంచి ఘాటు సువాసనకు ప్రసిద్ధి చెందింది. చాలా మంది పుదీనాను కేవలం బిర్యానీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పుదీనాని వివిధ రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. పుదీనా మీ జీవక్రియను సాఫీగా చేస్తుంది. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అదే విధంగా ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది. అప్పుడప్పుడు పుదీనా నమలడం వల్ల నోరు ఫ్రెష్‌గా ఉంటుంది. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. హ్యాంగోవర్‌ గా ఉన్నప్పుడు పుదీనా నమిలితే.. దాని నుంచి బయట పడొచ్చు. అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మ రసం:

హ్యాంగోవర్ ఎక్కువగా ఉన్నప్పుడు నిమ్మ రసం తాగితే చాలా మంచిది. నిమ్మ కాయ రసంలో విటమిన్ సి, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. నిమ్మ కాయను నీటిలో కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా తగ్గుతుంది.

దోసకాయ:

దోసకాయలో నీరు శాతం, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. హ్యాంగోవర్‌గా ఉన్నప్పుడు దోసకాయ తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. అంతేకాకుండా దోస కాయ తినడం వల్ల చలువ చేస్తుంది. బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను, టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది దోసకాయ. ఇలా మీ న్యూ ఇయర్ హ్యాంగోవర్‌కి ఇంటి చిట్కాలతో చెక్ పెట్టి.. హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.