Pigeon poop: పావురాల రెట్టలు చాలా ప్రమాదకరం.. వీటి ద్వారా ఆ వ్యాధుల ముప్పు

భారతీయ సమాజంలో పావురాలకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. శాంతికి చిహ్నంగా నిలిచే పావురాలు పూర్వకాలంలో పోస్ట్‌మెన్‌గా కూడా మనుషులకు సేవలందించాయి. పావురాల మీద అనేక పాటలు కూడా ఉన్నాయి. ప్రేమకు ప్రతిబింబింగా నిలిచే పావురాలు ప్రాణాలు తీస్తాయంటే నమ్మడం కష్టమే. ఎస్‌. అనేక రోగాలకు నిలయం పావురాలు. వీటి రెక్కలు, రెట్టలు విషతుల్యమనే చెప్పాలి.

Pigeon poop: పావురాల రెట్టలు చాలా ప్రమాదకరం.. వీటి ద్వారా ఆ వ్యాధుల ముప్పు
Pigeon Poop
Follow us
Ram Naramaneni

|

Updated on: May 03, 2023 | 6:27 PM

శాంతికి ప్రతిరూపం పావురాలు, అందుకే వాటిని అంటారు శాంతి కపోతాలు. అది ఒక కోణం మాత్రమే. శాంతికి చిహ్నంగా నిలిచే కపోతాలు ఇప్పుడు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న పావురాల కారణంగా తెలియకుండానే అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. పావురాలను చూసి చాలా మంది ముచ్చటపడుతూ ఉంటారు. కాని వాటి కారణంగా మనషులు అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వీటి కారణంగా చాలా మంది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు.  అనేక రకాల వైరస్‌లు, ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి పావురాలు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టలు, ఈకల ద్వారా అనేక వ్యాధులు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఇవి అరుదు కాని, ఈ మధ్య కాలంలో పావురాల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధులు ప్రబలే అవకాశాలూ అధికమవుతున్నాయి. పావురాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స చాలా కష్టమని డాక్టర్లు అంటున్నారు. పావురాల విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో పావురాలను పోషించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టలో హిస్టాప్లాస్మాసిస్‌ అనే ఫంగస్‌ ఉంటుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి హిస్టాప్లాస్మోసిస్‌ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. దీన్ని గుర్తించడం చాలా కష్టం.

పావురాల కారణంగా వచ్చే అనర్థాలను గుర్తించకుండా చాలా మంది పక్షి ప్రేమికులు వీటిని పెంచి పోషిస్తూ ఉంటారు. బస్టాండ్స్‌, హాస్పిటల్స్‌ దగ్గర ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్‌ నగరంలో అపార్టుమెంట్ల కిటీకిలు, మెట్రో రైల్‌ పిల్లర్లు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాల్లో పావురాల సంఖ్య చాలా ఎక్కువుంటుంది. పావురాల రెట్టలు చాలా ప్రమాదకరం. వీటి ద్వారా శ్వాసకోశ వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. చర్మం సమస్యలు ఉదరకోశ వ్యాధులు కూడా పావురాల కారణంగా వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒక పావురం ఒక ఏడాది కాలంలో 11 కేజీల రెట్ట వేస్తుంది. పావురాలు సాధారణంగా గుంపులుగా ఉంటాయి. ఇవి పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి అవి ఉండే చోట పెద్ద మొత్తంలో విసర్జకాలు జమవుతాయి. ఇవి ఎండిన తర్వాత గాల్లో కలిసిపోయి మనుషుల్లోకి చేరుతాయి. అంతే కాదు పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాల దగ్గర పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటి రెట్టల కారణంగా ఆ కట్టడాలు దెబ్బతింటున్నాయి.

హైదరాబాద్‌ నగరంలోనూ పావురాల సంఖ్య తక్కువేమి లేదు. నగరంలో చాలా చోట్ల గుంపులు గుంపులుగా పావురాలు కనిపిస్తూ ఉంటాయి. పావురాలకు దాణా వేయడం చాలా మంది పుణ్యకార్యంగా భావిస్తుంటారు. గ్రహశాంతుల కోసం పావురాలకు ఆహారం అందించే వారు కొందరైతే సరదా కోసం చేసేవాళ్లు మరికొందరు. ఏది ఏమైనా మెట్రో నగరాల్లో పావురాల సంఖ్య బాగా పెరుగుతోందన్నది వాస్తవం. పావురాలకు దాణా వేసేటప్పుడు ముఖానికి మాస్క్‌ కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పక్షులపై ప్రేమ ఉండటం మంచిదే, కాని వాటి కారణంగా కలిగే అనర్థాల గురించి కూడా అవగాహన ఉండాలని నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!