Hypersomnia: అతి నిద్ర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలివే.. ముఖ్యంగా మీ గుండె, మెదడుకు ప్రమాదం.. పూర్తి వివరాలివే..

|

Apr 13, 2023 | 6:25 AM

మానవ శరీరానికి ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి, నిద్ర కూడా అంతే అవసరం. ముఖ్యంగా నిద్ర మన ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. మారిన జీవన శైలి, తనపై ఉన్న ఉద్యోగ బాధ్యతల కారణంగా మనిషి సరిగా నిద్రించలేకపోతున్నాడు. అలా సరిగా నిద్రపోకపోతే..

Hypersomnia: అతి నిద్ర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలివే.. ముఖ్యంగా మీ గుండె, మెదడుకు ప్రమాదం.. పూర్తి వివరాలివే..
Over Sleeping side effects
Follow us on

Oversleeping Side Effects: మానవ శరీరానికి ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి, నిద్ర కూడా అంతే అవసరం. ముఖ్యంగా నిద్ర మన ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. మారిన జీవన శైలి, తనపై ఉన్న ఉద్యోగ బాధ్యతల కారణంగా మనిషి సరిగా నిద్రించలేకపోతున్నాడు. అలా సరిగా నిద్రపోకపోతే నిద్రలేమితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడతామని మనకు తెలిసిందే. అయితే తక్కువగా నిద్రపోవడమే కాదు, ఎక్కువగా లేదా అతిగా నిద్రించడం కూడా ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును, రోజుకి 7 నుంచి 9 గంటల కంటే ఎక్కువగా నిద్రించేవారిని అనేక రకాల రుగ్మతలు వెంటాడతాయని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీకెండ్స్‌లో అతిగా నిద్రించకుండా విశ్రాంతి కోసం గంట కంటే తక్కువ సమయం నిద్రించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే అతి నిద్ర వల్ల కలిగే సమస్యలేమిటో తెలియజేశారు ఆరోగ్య నిపుణులు.

అతి నిద్ర వల్ల కలి గే ఆరోగ్య సమస్యలు

వెన్నునొప్పి: మనిషి తన రోజులో సగటుగా 8 గంటలు నిద్రించాలి. అయితే అంతకుమించి ఎక్కువ సమయంల నిద్రించడం వల్ల వెన్నునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెడ్‌పై ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి. ఇంకా స్లీపింగ్ పొజిషన్‌ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కండరాలు నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ కారణాలతో మీరు వెన్నునొప్పి బారిన పడే ప్రమాదం ఉంది.

డిప్రెషన్: సాధరణంగా నిద్రలేమి సమస్య వల్ల డిప్రెషన్ ఎక్కువగా వస్తుంటుంది. అయితే అతి నిద్ర వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 15% మందిలో అధిక నిద్ర వల్ల డిప్రెషన్ వస్తున్నట్లు ఇటీవల జరిగిన పలు అధ్యాయనాల ద్వారా వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

నాడీ వ్యవస్థపై, మెదడు ప్రభావం: అతినిద్ర దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మతకు కారణమవుతుంది. ఎక్కువ సమయం నిద్ర అంటే రాత్రి నిద్రతో పాటు తెల్లవారిన తర్వాత కూడా నిద్ర కొనసాగుతూనే ఉంటుంది. అయితే మన శరీరానికి నిర్ధిష్ట సమయంలో నిద్రించే, విశ్రాంతి తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా సమయం కానీ సమయంలో నిద్రపోవడం వల్ల అది మన మెదడుపై ప్రభావం చూపి, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితమయ్యేలా చేస్తుంది.

తలనొప్పి: ఎక్కువ నిద్రపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎందుకంటే అతి నిద్ర సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మానసిక స్థితి, నిద్ర నియంత్రణకు ఉపయోగపడే సెరోటోనిన్‌ స్థాయిలను అతి నిద్ర తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలు బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మైగ్రేన్లు లేదా తలనొప్పి రావచ్చు.

అలసట: అతిగా నిద్రపోవడం వల్ల అలసట కలుగుతుందని అధ్యయనాల్లో తేలింది. తొమ్మిది గంటలకు పైగా నిద్రపోయేవారు ఆ తర్వాత మేల్కొవడానికి ఇబ్బంది పడతారు. ఫలితంగా పగటిపూట అలసట, నీరసంగా ఉంటారు. అలాగే పగటి పూట నిద్ర.. నిద్ర లేమికి కూడా కారణమవుతుంది.

ఇంకా అతినిద్రతో డయాబెటీస్, గుండెనొప్పి, గుండెలో దడగా ఉండడం వంటివి ఎదురవుతాయి. ఒబెసిటీకి కూడా ఇది కారణం కాగలదు. అంతేకాక అతిగా నిద్రించడం వల్ల కొన్ని సందర్భాలలో మరణం సంభవించే అవకాశం కూడా ఉందని నిపుణులు, అధ్యయనాలు వెల్లడించాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..