Onion Benefits: పచ్చి ఉల్లిపాయలతో ఇన్ని రకాల బెనిఫిట్స్‌ ఉన్నాయా?

|

Feb 10, 2024 | 10:56 AM

ఆహార నియమాలు పాటించడం వల్ల మన ఆరోగ్యానిన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. మన ఇంట్లోనే ఉండే కొన్నింటిని పాటించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇక ప్రతి ఒక్కటి వంటింట్లో ఉండేది ఉల్లిపాయలు. వీటి ప్రయోజనాలు అంతాఇంతా కాదు. ఉల్లిపాయలు అనేవి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అయితే మీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

Onion Benefits: పచ్చి ఉల్లిపాయలతో ఇన్ని రకాల బెనిఫిట్స్‌ ఉన్నాయా?
Onion Benefits
Follow us on

ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు. మారుతున్న జీవనశైలి. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అతిగా ఆలోచించడం, సరైన వ్యాయమం లేకపోవడం తదితర కారణాల వల్ల మనిషికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల మన ఆరోగ్యానిన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. మన ఇంట్లోనే ఉండే కొన్నింటిని పాటించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇక ప్రతి ఒక్కటి వంటింట్లో ఉండేది ఉల్లిపాయలు. వీటి ప్రయోజనాలు అంతాఇంతా కాదు. ఉల్లిపాయలు అనేవి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అయితే మీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి ఉల్లితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే..

ఇవి కూడా చదవండి
  1. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది: ఉల్లి డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించే గుణం ఉంది. ఉల్లిపాయ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ అందులో ఉంటాయి.
  2. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
  3. బరువు తగ్గడం: ఉల్లిపాయలు తక్కువ కాలరీలు ఉండడమే కాకుండా అధిక ఫైబర్ కంటెంట్‌ కలిగి ఉంటుంది. ఇది కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
  4. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ రసాయాలు ఉండటం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
  5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలలోని సల్ఫర్ ఉండటం కారణంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అంతేకాదు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
  6. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తరిమికొడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. సరైన జీర్ణక్రియకు, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా ముఖ్యమైనది.
  7. ఎముక ఆరోగ్యానికి..: ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎములు బలోపేతం అవుతాయి.ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది.
  8. మెదడు పనితీరు: పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. మెదడు పనితీరును యాక్టివ్‌ చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేలా చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి