తాళం వేసి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసినా మళ్లీ మళ్లీ తాళం వేశామా లేదా అని చెక్ చేస్తున్నారా..?. కారును లాక్ చేసిన తర్వాత, దాన్ని ఐదు నుండి ఆరు సార్లు చెక్ చేసిన తర్వాత కూడా లాక్ అయ్యిందా లేదా అని మదనపడుతున్నారా..? కడిగిన రూమ్‌ని పదే, పదే కడుగుతున్నారా..? అయితే మీరు మానసిక అనారోగ్యానికి గురయినట్లు లెక్క. ఈ వ్యాధిని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) అంటారు. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రతి 100 మందిలో ఇద్దరు తమ జీవితంలో ఎప్పుడైనా ఈ వ్యాధిని ఎదుర్కొంటారు. OCD కారణంగా, రోజువారీ జీవితం కూడా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ చాలా ముఖ్యం.
OCDతో బాధపడుతున్న రోగి ఒక పనిని చాలాసార్లు పునరావృతం చేస్తారని వైద్యులు చెబుతారు. చాలా సందర్భాలలో, రోగికి సంవత్సరాల తరబడి ఈ సమస్య ఉన్నప్పటికీ, అది మానసిక వ్యాధి అని అతనికి తెలియదు. OCD పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి సంబంధించిన ఎక్కువ కేసులు 15 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లలో కనిపిస్తాయి. అతిగా ఆలోచించేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది.
OCD ఒక మానసిక వ్యాధి అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు డ్యామేజ్ అవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ వ్యాధి బాధితుల మనసులో పదే, పదే ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. విలువైనది ఏదైనా పోతుందనే భయం, తమకు ప్రమాదం జరగుతుందేమో అన్న భయం, తమకు ఏదైనా జబ్బు చేసిందేమో అన్న భయం లాంటివి వెంటాడుతూ ఉంటాయి. చేసిన పనినే మళ్లీ, మళ్లీ రిపీట్ చేయడం ఇందులో ప్రధానంగా కనిపించే లక్షణం. తాళం పడిందా లేదా అని చాలా సార్లు చెక్ చేయడం, రోజులో చాలా సార్లు చేతులు కడుక్కోవడం.. కొన్ని పనుల చేసిన తర్వాత కూడా చేశామా లేదా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.
వైద్యులు తెలుపుతున్న వివరాల ప్రకారం, OCD ఒక వ్యక్తి రోజువారీ జీవితంపై ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు కాబట్టి ఇలా జరుగుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆఫీసులో కూర్చుని, అతను ఇంటికి తాళం వేసి ఉన్నారా లేదా లేదా వంట గ్యాస్ స్విచ్ ఆఫ్ చేశామా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో, ఎటువంటి కారణం లేకుండా అతడి మనస్సులో ఆందోళన ఉంటుంది. దీంతో రోజువారీ జీవనం దెబ్బతింటోంది.
ఒక వ్యక్తికి OCD సమస్య ఉంటే, మానసిక వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు ఈ వ్యాధికి మెడిసిన్ ఇస్తారు. కొందరికి కౌన్సిలింగ్‌తో నయమవుతుంది. మరికొంతమందికి యోగా, మెడిటేషన్ వంటివి సజిస్ట్ చేశారు.. ఈ సమస్య ఇటీవల మీలో ప్రారంభమైతే, మీరే దానిని కంట్రోల్ చేయవచ్చు. ఓసీడీ లక్షణాలు మీలో ఉంటే మీ మనస్సులో వచ్చే ఆలోచనలను పదే పదే నియంత్రించడానికి ప్రయత్నించండి. మీరు దేనికైనా భయపడితే, మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి