Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్, ట్రాన్స్‎పోర్టు, ట్రీట్‎మెంట్ కట్.. ఎక్కడంటే..

| Edited By: Anil kumar poka

Dec 01, 2021 | 1:00 PM

సౌత్ ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రయాణాలపై నిషేధాన్ని ఎత్తేసిన దేశాలు మరోసారి నిషేధం విధించడాన్ని పరిశీలిస్తున్నాయి. అనేక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి ఇష్టపడని వారిపై కఠినమైన వైఖరి అవలంబిస్తున్నాయి...

Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్, ట్రాన్స్‎పోర్టు, ట్రీట్‎మెంట్ కట్.. ఎక్కడంటే..
Vaccine
Follow us on

సౌత్ ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రయాణాలపై నిషేధాన్ని ఎత్తేసిన దేశాలు మరోసారి నిషేధం విధించడాన్ని పరిశీలిస్తున్నాయి. అనేక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి ఇష్టపడని వారిపై కఠినమైన వైఖరి అవలంబిస్తున్నాయి. భారతదేశంలో బుధవారం నాటికి 1,24,10,86,850 మందికి టీకా తీసుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 50 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 29 దేశాలలో భారత్ ర్యాంక్‎ గత రెండు నెలల్లో పడిపోయింది. నవంబర్ 16 నాటికి ప్రపంచ సగటు 100 మందికి 96 డోసులు వేయగా దేశంలో సగటు 100మందికి 81గా ఉంది. ప్రపంచ జనాభాలో 41% మందికి టీకా వేశారు. భారత్‎లో 27% మందికి మాత్రమే రెండు డోసులు ఇచ్చారు. భారతదేశం చాలా కాలంగా వ్యాక్సిన్‌ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ చేయడంలో వెనకబడింది. ఇంకా టీకాలు వేయించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి:

కేరళ

కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోని వారికి ఉచిత కోవిడ్ చికిత్స అందించకూడదని కేరళ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక

కర్ణాటక సాంకేతిక సలహా కమిటీ (TAC) టీకా తీసుకోని వారికి ప్రజా సౌకర్యాలుష, రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేయాలని సిఫార్సు చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మెట్రో రైళ్లు, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, సినిమా హాళ్లు, ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్‌లు, పార్కులు, లైబ్రరీలు, ఫ్యాక్టరీలు, ఎగ్జిబిషన్లుకు టీకా వేయించుకున్న వారినే అనుమతించాలని పేర్కొంది.

మహారాష్ట్ర

వ్యాక్సినే తీసుకోని వారు త్వరలో థానే కార్పొరేషన్ రవాణా బస్సుల్లో ఎక్కలేరని థానే మేయర్ నరేష్ మ్హాస్కే అన్నారు. థానేలో దాదాపు 70% మంది మొదటి డోసు తీసుకన్నారని చెప్పారు. మొదట్లో, సింగిల్ డోస్ తీసుకున్నవారిని అనుమతిస్తామని, కానీ వారు రెండు డోసులు తీసుకోవాలని తెలిపారు.

మధ్యప్రదేశ్

ఎంపీ ఖాండ్వా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు పొందిన వారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని ప్రకటించారు. ఖాండ్వా అంతటా ఉన్న 74 మద్యం దుకాణాలకు ఈ కొత్త నిబంధన వివరించామని పేర్కొన్నారు.

Read Also.. UP Assembly Elections 2022: యూపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలతో రథయాత్రకు ఫ్లాన్!