Night Shifts Problems: అందరికీ అన్ని రంగాలలో జనరల్ డ్యూటీలు ఉండే ఉద్యోగాలు రావడం చాలా కష్టం. చాలా సంస్థల్లో నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. ఉద్యోగులు నైట్ డ్యూటీలు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ రాత్రి షిఫ్టులలో పని చేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
నిద్రపోవడానికి సమయాన్ని సెట్ చేసుకోండి: నిర్ణీత వ్యవధిలో నిద్రపోవడం వలన బరువు పెరగడం, మానసిక ఒత్తిడితో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి షిఫ్టులో పనిచేసే వారు ముందుగా నిద్ర సమయాన్ని ఫిక్స్ చేసి, రోజులో ఒకే సమయంలో నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కాఫీ, టీ తాగడం తగ్గించండి: టీ, కాఫీ, ఇతర కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి నిద్ర పట్టకూడదనే ఉద్దేశంతో వీటిని తాగితే.. హెల్త్ ఎఫ్టెక్ట్ అవుతుంది.
ఖాళీ సమయాన్ని ఆస్వాదించండి: ప్రతి ఒక్కరికి వారి ఉద్యోగంతో పాటు స్వంత జీవితం కూడా ఉంటుంది. ఖాళీ సమయంలో మీ కుటుంబంతో సమయం గడపండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మంచి ఆహారం తినాలి: ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. దాని కోసం రోజులో కొంత సమయం కేటాయించాలి. ఎప్పుడూ బద్ధకంగా ఉండొద్దు. వ్యాయామం చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
అతిగా తినవద్దు: రాత్రిపూట పని చేసే వారు ఎక్కువగా తింటారని అనేక పరిశోధనల్లో తేలింది. అయితే, అతిగా అస్సలు తినొద్దు. అతిగా తింటూ ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అధిక కేలరీలు అంది.. మధుమేహం వంటి సమస్యలు రావొచ్చు. అందుకే తీసుకునే ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి: మీ ఆరోగ్య రక్షణకు యోగా, ధ్యానం వంటి చేస్తే ఫలితం ఉంటుంది. మంచి ఆహారం, మంచి జీవన శైలిని అలవరుచుకోవాలి.
కాగా, ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వ్యక్తులు మధుమేహ సమస్యను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారని తేలింది. అయితే, ఉదయం పూట పనిచేసే వారికి మధుమేహం నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.