Neem Face Pack: ఆయుర్వేదంలో వేపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఔషధంగా పనిచేస్తుంది. అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో వేపను ఉపయోగిస్తారు. ఇది చర్మం, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమల మచ్చలని తొలగించడానికి పనిచేస్తుంది. పిగ్మెంటేషన్, బ్లాక్‌హెడ్స్‌ను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది. వేపతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
నల్ల మచ్చలను పోగొట్టడానికి
ఒక టీస్పూన్ వేప ఆకుల పేస్ట్ తీసుకోండి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. పెరుగు మచ్చలు, డార్క్ స్పాట్‌లను శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
మెరిసే చర్మం కోసం
కొన్ని వేప ఆకులు, తులసి ఆకులను తీసుకోండి. వీటిని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోండి. దీనికి ఒక చెంచా తేనె, ముల్తానీ మిట్టి కలపండి. మెడ, ముఖంపై అప్లై చేసి 15 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత నీటితో కడగాలి. ముల్తానీ మిట్టి మృతకణాలను తొలగిస్తుంది. తులసి చర్మాన్ని శుభ్రంగా మెరిసేలా చేస్తుంది.
సహజ కాంతి కోసం
9 నుంచి10 వేప ఆకులను ఉడికించి పేస్ట్ చేయండి. దీనికి ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపండి. అర టీస్పూన్ గంధం పొడిని కలపండి. దీన్ని ముఖం, మెడపై అప్లై చేయండి. ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి పనిచేస్తుంది.
పొడి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి
వేప ఆకులను ఉడకబెట్టి పేస్ట్ చేయండి. దానికి అర టీస్పూన్ పసుపు కలపండి. అర టీస్పూన్ వర్జిన్ కొబ్బరి నూనె కలపండి. దీన్ని చర్మంపై 15 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి పనిచేస్తుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.