Moringa Leaf Benefits: మునగ ఆకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
మునగకాయలు(Drum Sticks) తింటారని తెలుసు కానీ మునగ ఆకులు(Moringa Leaf) తింటారని తెలుసా అంటే చాలా మందికి తెలియదు. కానీ మునగ ఆకు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది...
మునగకాయలు(Drum Sticks) తింటారని తెలుసు కానీ మునగ ఆకులు(Moringa Leaf) తింటారని తెలుసా అంటే చాలా మందికి తెలియదు. కానీ మునగ ఆకు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్లు(Vitamins), ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకు అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారం. డయాబెటిక్ రోగులకు మునగ ఆకులు ఎంతో ఉపయోగకరం. నిజానికి, మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీని వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. షుగరు ఉన్నవారు మునగ ఆకు తీసుకోవాలి. మునగ ఆకులు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తయారు చేయవు. ఈ ఆకులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.
మునగ ఆకుల్లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. అంటే బీపీ ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా మునగ ఆకులను ఆహారంలో తీసుకోవాలి. మునగ ఆకులతో క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, జింక్, ఇతర క్రియాశీల భాగాలు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు, ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తాయి. రక్తహీనత నివారించటంలో మునగ ఆకులు చాలా ఉపయోగపడతాయి. మునగ ఆకులు కంటి చూపును పదును పెట్టడంలో కూడా సాయం చేస్తాయి. అనేక రకాల వ్యాధులకు మూలం జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. మనుగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. కిడ్నీలోని రాళ్లను కరిగించి మూత్ర ద్వారా బయటకు వెళ్లేందుకు సహకరిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతంది. మీ శరీరం అన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా నుండి రక్షించబడుతుంది.
Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.