Childrens Care: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
కరోనా మళ్లి విజృభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందంటూ
కరోనా మళ్లి విజృభిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. కరోనా కొత్త ఎక్స్ఈ వేరియంట్ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతుంది. పెద్దలతోపాటు.. చిన్న పిల్లల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా కొత్త వేరియంట్ పెద్ద, చిన్నా అనే తేడ లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కోవిడ్ కొత్త వేరియంట్ బారిన పడినప్పుడు మీ పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు నిపుణులు. పిల్లలో కనిపించే మొదటి లక్షణం అతిసారం లేదా కడుపు నొప్పి. జ్వరం, గొంతు నొప్పి, పొడి దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కుకారటం, చలి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి వంటివి ఉంటాయి. అయితే ఈ కోవిడ్ కొత్త వేరియంట్‌తో తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. అలాగే వీటిని అశ్రద్ధ కూడా చేయకూడదు..
పిల్లలను ఎలా రక్షించాలి.. తల్లిదండ్రలు తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.. ఆహారం, నిద్రపోవడం, పరిశుభ్రతను పాటించడం, అర్హులైన పిల్లలకు త్వరగా టీకాలు వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలి. పరిశుభ్ర, చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను పిల్లల జీవనశైలిలో ఇంటితో పాటు పాఠశాలలోనూ అవగాహన కల్పించాలి.
కరోనా కొత్త వేరియంట్ గురించి పిల్లల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలలో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని.. సకాలంలో చికిత్స చేయడంతో పిల్లలు కూడా త్వరగా కోలుకుంటున్నారు. అర్హులైన పిల్లలకు టీకాలు వేయాలి.. ఇంకా టీకా సౌకర్యాలు లేని పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
పోషకాహార చిట్కాలు.. 1. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 2. రెడ్ మీట్ కు బదులు వైట్ మీట్ తీసుకోవాలి. 3. ఆహారంలో ఉప్పును తక్కువగా వినియోగించాలి. 4. రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నించాలి. దీంతో శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 5. మాంసం, వెన్న, కొబ్బరి నూనె, క్రీమ్, చీజ్, నెయ్యి, పందికొవ్వులో ఉండే అంసతృప్త కొవ్వులకు బదులుగా చేపలు, అవకాడోలు, గింజలు, ఆలివ్ నూనె, సోయా, కనోలా, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న నూనెలలో ఉండే సంతృప్త కొవ్వులను తీసుకోవాలి.
గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సలహాలు, అభిప్రాయాల ప్రకారం ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..
Ram Charan: బాబాయ్‌తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..
Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..