Health Tips: మీకు 40 ఏళ్లు వచ్చాయా..? జాగ్రత్త.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం..!

Health Tips: ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో రకరకాల వైరస్‌ (Virus)లు వెంటాడుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని..

Health Tips: మీకు 40 ఏళ్లు వచ్చాయా..? జాగ్రత్త.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం..!
Follow us

|

Updated on: May 06, 2022 | 5:09 PM

Health Tips: ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో రకరకాల వైరస్‌ (Virus)లు వెంటాడుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, పురుషుల(Men)కు 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక భారం, ఒత్తిళ్ల కారణంగా శరీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు 40 ఏళ్లకు చేరుకోబోతున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి. లేకపోతే వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

మధుమేహం:

ఆహారం, చెడు జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశాలున్న సంగతి తెలిసిందే.  ఒత్తిడి వల్ల ఈ వ్యాధి ప్రభావం మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే.. సాధారణ వ్యక్తుల కంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనితో పాటు, మీ ఆహారాన్ని నియంత్రించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

కండరాల బలహీనత:

మన శరీర కదలికలు కండరాల వల్లనే జరుగుతాయి. దాదాపు 40 ఏళ్ల నుంచి కండరాలు బలహీనపడటం మొదలవుతాయి. కండరాలు బలహీనపడటం వల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని దృఢంగా మార్చాలంటే వ్యాయామం, మంచి ఆహారం అవసరం. నేటి జీవన విధానం వల్ల సమయానికి ఆహారం తినకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు దరి చేరుతున్నాయి.  ఇలా జరగకూడదంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన పోషకాహారాలు తీసుకోవడం తప్పనిసరి. 40 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఈ పద్దతులను పాటిస్తే ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?

(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)