Health Tips: ఎండాకాలం ఈ కూరగాయల జ్యూస్‌లు తాగితే బోలెడు ప్రయోజనాలు..!
Health Tips: వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇందులో పుచ్చకాయ, దోసకాయలు మొదలైన ఆహారాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా
Health Tips: వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇందులో పుచ్చకాయ, దోసకాయలు మొదలైన ఆహారాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అంతేకాదు మండే వేడిలో ఒక గ్లాసు కూరగాయల రసం తీసుకుంటే శరీరానికి చాలా ఉపశమనం కలుగుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా హైడ్రేట్‌గా ఉంచుతుంది. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. వేసవిలో కూరగాయలతో తయారు చేసే జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.
సొరకాయ రసం
సొరకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇందులో కె, సి, క్యాల్షియం విటమిన్లు ఉంటాయి. ఒక గ్లాసు సొరకాయ రసంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రుచిని మెరుగుపరచడానికి దీంట్లో నిమ్మరసం కలుపుకోవచ్చు.
దోసకాయ రసం
దోసకాయను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దోసకాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు దోసకాయ రసం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు నల్ల మిరియాలు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
గుమ్మడికాయ రసం
గుమ్మడికాయ రసం అంటే మీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇది కడుపు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది విటమిన్లు D, B1, B2, B6, C, E, రాగి, ఐరన్, భాస్వరంతో సహా అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా ఒక గ్లాసు గుమ్మడికాయ రసం తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం అవుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి