IPL 2022, Orange Cap: టాప్‌ 5 లోకి దూసుకొచ్చిన అభిషేక్ వర్మ.. బట్లర్‌తో పోటీకి రెడీ..!

IPL 2022, Orange Cap: ఐపీఎల్ 2022లో భాగంగా అభిమానులు మరో అద్భుతమైన మ్యాచ్‌ని చూశారు. ఈ మ్యాచ్ ఆరెంజ్ క్యాప్‌పై కూడా పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ మ్యాచ్ చివరి

IPL 2022, Orange Cap: టాప్‌ 5 లోకి దూసుకొచ్చిన అభిషేక్ వర్మ.. బట్లర్‌తో పోటీకి రెడీ..!
Orange Cap
Follow us

|

Updated on: Apr 28, 2022 | 11:49 AM

IPL 2022, Orange Cap: ఐపీఎల్ 2022లో భాగంగా అభిమానులు మరో అద్భుతమైన మ్యాచ్‌ని చూశారు. ఈ మ్యాచ్ ఆరెంజ్ క్యాప్‌పై కూడా పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ మ్యాచ్ చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ఓటమిని అందించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్‌ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కానీ రషీద్ ఖాన్ చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదడంతో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోరింగ్‌ జరగడంతో ఇరు జట్ల నుంచి భారీ పరుగులు వచ్చాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 195 పరుగులు చేయగా గుజరాత్ జట్టు చివరి బంతికి లక్ష్యాన్ని సాధించింది. పరుగుల వర్షం కురుస్తున్నప్పుడు ఆరెంజ్ క్యాప్‌లో కూడా మార్పులు రావడం సహజం. ఈ లీగ్‌లో 40వ మ్యాచ్ తర్వాత హైదరాబాద్ యువ స్టార్ అభిషేక్ శర్మ భారీ జంప్ చేశాడు. కానీ ఆరెంజ్‌ క్యాప్‌ ఇప్పటికీ బట్లర్ తలపైనే ఉంది.

అభిషేక్ జంప్

హైదరాబాద్, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ రేసును మార్చింది. ఈ క్యాప్ ఇప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తలపై అలంకరించి ఉంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ శర్మ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్ 10లో ఉన్న అతను ఇప్పుడు ఐదో స్థానానికి చేరాడు. అభిషేక్ 8 మ్యాచ్‌ల్లో 285 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతను పంజాబ్ కింగ్స్‌కు చెందిన శిఖర్ ధావన్‌ను అధిగమించి మూడో ర్యాంక్‌ను అక్రమించాడు. బట్లర్, కేఎల్ రాహుల్ తర్వాత పాండ్యా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CBSE Counselling: పరీక్షా సమయంలో విద్యార్థులు రిలాక్స్‌గా ఉండాలి.. అవసరమైతే సైకలాజికల్ కౌన్సెలింగ్..!

Perfumes: ఈ 5 పెర్ఫ్యూమ్‌లు మహిళలకు గుడ్‌.. వేసవిలో తాజాగా ఉంచుతాయి..!

IPL 2022 Purple Cap: గుజరాత్‌పై నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ మాలిక్.. పర్పుల్ క్యాప్ రేసులో చాహల్‌కి గట్టి పోటీ..!

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు