- Telugu News Photo Gallery IPL 2022 : Here see top 5 overseas players with most ducks in the ipl history
IPL 2022: ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సార్లు డకౌటైన విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆ టాప్ ప్లేయర్ కూడా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దేశ, విదేశాలకు చెందిన క్రికెటర్లను కోట్లు పోగేసి కొనుగోలు చేస్తాయి ఆయా ఫ్రాంచైజీలు. ఇందులో కొందరు అద్భుతంగా ఆడుతారు..మరికొందరు నిరుత్సాహ పరుస్తారు.. మరి ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక సార్లు సున్నా పరుగులకు ఔటైన విదేశీ ఆటగాళ్లు ఎవరంటే..
Updated on: Apr 28, 2022 | 12:24 PM

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వీరే

క్రిస్ మోరిస్: క్రిస్ మోరిస్ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడడం లేదు. అతను గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో మోరీస్ మొత్తం 9 సార్లు డకౌట్ అయ్యాడు

AB డివిలియర్స్: ఈ ప్రొటీస్ స్టార్ క్రికెటర్ కూడా ప్రస్తుత ఐపీఎల్‌లో ఆడడం లేదు. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన అతను 10 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు.

సునీల్ నరైన్: ఈ కరీబియన్ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు. అతను కూడా మొత్తం 10 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

రషీద్ ఖాన్: ప్రస్తుత ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు రషీద్ ఖాన్. ఈ టాప్ స్పిన్నర్ మొత్తం 11 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం RCB తరపున ఆడుతున్నాడు. అతను మొత్తం 12 సార్లు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.




