Health Tips: మీరు రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారు.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!

Health Tips: ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి.. ఇది చాలామందికి తెలియదు. కొంతమంది టాయిలెట్‌కు పదే పదే వెళుతూ ఉంటారు.

Health Tips: మీరు రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారు.. ఒక్కసారి ఈ విషయాలు గమనించండి..!
Urinate
Follow us

|

Updated on: Apr 28, 2022 | 1:03 PM

Health Tips: ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి.. ఇది చాలామందికి తెలియదు. కొంతమంది టాయిలెట్‌కు పదే పదే వెళుతూ ఉంటారు. మరికొందరు బాత్రూమ్‌కు వెళ్లకుండా గంటల తరబడి కూర్చుంటారు. ఇక మద్యపానం చేసే వ్యక్తులు తమ ఆరోగ్యానికి ఎటువంటి సమస్య లేదని భావిస్తారు. వాస్తవానికి ఒక రోజులో మూత్ర విసర్జన ఎన్నిసార్లు చేయాలో తెలుసుకుందాం. రోజులో 6 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ కొందరు వ్యక్తులు దీని కంటే తక్కువ లేదా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. అలా అని వారికి ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మూత్ర విసర్జన ఫ్రీక్వెన్సీ రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటి విషయం మీ మూత్రాశయం పరిమాణం. రెండో విషయం మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే యూరిన్ ఫ్రీక్వెన్సీని ఎక్కువగా ప్రభావితం చేసే మరో అంశం కెఫిన్. అంటే రోజులో ఎంత టీ లేదా కాఫీ తాగుతారు. అలాగే ధూమపానం చేసేవారు ధూమపానం చేయని వారి కంటే ఎక్కువగా బాత్రూమ్‌ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.

మీరు తరచుగా బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావడం కానీ మూత్రం పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట సమస్య ఉందా లేదా మూత్రం రంగు మారిందా అనే విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ ఇలా జరిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. వాస్తవానికి తక్కువ పరిమాణంలో నీరు తాగడం వల్ల మూత్రం ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. మూత్రం పరిమాణం కూడా తగ్గుతుంది. మూత్రం పసుపు రంగుతో పాటు, మంట సమస్య కూడా ఉంటుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ నీరు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

గుడ్‌న్యూస్‌.. మరో రెండు మూడు నెలల్లో రైతులు డ్రోన్లు ఉపయోగించే అవకాశం..!

IPL 2022, Orange Cap: టాప్‌ 5 లోకి దూసుకొచ్చిన అభిషేక్ వర్మ.. బట్లర్‌తో పోటీకి రెడీ..!

CBSE Counselling: పరీక్షా సమయంలో విద్యార్థులు రిలాక్స్‌గా ఉండాలి.. అవసరమైతే సైకలాజికల్ కౌన్సెలింగ్..!