Skin Benefits With Mango: రుచికి రుచి… అందానికి అందం.. మామిడితో చర్మ సౌందర్యం రెట్టింపు..
Skin Benefits With Mango: వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఎండలు మండుతాయని తెలిసినా.. సమ్మర్ రావాలని కోరుకునేది ఈ పండు గురించే. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌గా పిలచుకునే ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. రకరకాల...
Skin Benefits With Mango: వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఎండలు మండుతాయని తెలిసినా.. సమ్మర్ రావాలని కోరుకునేది ఈ పండు గురించే. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌గా పిలచుకునే ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. రకరకాల పేర్లతో లభించే ఈ పండును తింటుంటే ప్రపంచాన్నే మైమరిచిపోతుంటాం. ఇందులో ఉండే విటమిన్స్, పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మామిడి కేవలం రుచి, ఆరోగ్యానికే కాకుండా ముఖారవిందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేసే మామిడితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం..
* ఒక చెంచా మామిడి పండు గుజ్జులో అర చెంచా పాలతో పాటు తేనె కలిపి ముఖానికి అప్లై చేసి బాగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలిగిపోతాయి. అంతేకాకుండా డెడ్ స్కిన్ తొలిగిపోవడంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
* కొద్దిగా గోధుమ పిండిలో ఒక చెంచాడు మామిడి గుజ్జును తీసుకొని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి.. ఇది మంచి యాస్ట్రిజెంట్‌గా ఉపయోగపడి.. చర్మ గ్రంధులు తెరుచుకునేలా చేస్తుంది.
* మామిడిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, విటమిన్ ఈ చర్మాన్ని ఎండిపోకుండా చూసుకుంటుంది.
* మీరు ఆయిల్ స్కిన్‌తో బాధపడుతున్నారా.? ముఖం ఎప్పుడూ జిడ్డుగా ఉంటుందా.? అయితే మామిడిని ట్రై చేయాల్సిందే. ఇందులో ఉండే మెగ్నీషియం ఆయిల్ స్కిన్‌ను చెక్ పెడుతుంది.
* మామిడిలో ఉండే విటమిన్ ఏ కారణంగా చర్మంపై ఉండే నల్లటి మచ్చలు తొలిగిపోతాయి. అంతేకాకుండా ముఖం మెరిసేలా మారుతుంది. ముఖ్యంగా ఎండకు కందిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
Also Read: ఏప్రిల్ 7న పుష్పరాజ్ పరిచయం.. సాయంత్రం బన్నీ పుష్ప లుక్ రిలీజ్.. ఆగస్టు 13న థియేటర్లలో సందడి..
Rashmika Mandanna: రష్మిక మందన్నా పుట్టిన రోజు.. అరుదైన వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు..