AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక మందన్నా పుట్టిన రోజు.. అరుదైన వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు..

'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా ఎదిగింది రష్మిక మందన్నా. ఈ సినిమా తర్వాత

Rashmika Mandanna: రష్మిక మందన్నా పుట్టిన రోజు.. అరుదైన వీడియో షేర్ చేసిన మాజీ ప్రియుడు..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2021 | 7:16 PM

Share

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా ఎదిగింది రష్మిక మందన్నా. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమె కోసం ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. అటూ తమిళం, హిందీలో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది రష్మిక. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆమె మాజీ ప్రియుడు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి సోషల్ మీడియా వేదికగా రష్మికకు సంబంధించిన ఓ అరుదైన వీడియోను షేర్ చేస్తూ.. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

రష్మిక మందన్నా.. కన్నడలో తెరకెక్కి్న్న ‘కిరిక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఇక ఆ సమయంలోనే రష్మిక, రక్షిత్ శెట్టి వీరిద్ధరు ప్రేమలో ఉన్నారు. దీంతో 2017లో వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ.. ఆ తర్వాతి సంవత్సరం వీరు విడిపోయారు. ఇక ఆ సినిమా ఆడిషన్స్‎లో రష్మిక పాల్గోన్న వీడియోను షేర్ చేశాడు రక్షిత్ శెట్టి.. కిరిక్ పార్టీ ఆడిషన్‏లో మధురానుభూతులను షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో దేదీప్యమానంగా కొనసాగుతుంది. నువ్వు నిజమైన యోధురాలిలా నీ కలలను చేధించావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి అంటూ రాసుకోచ్చాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. అప్పటి క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో తెరుకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా.. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రాబోతున్న గుడ్ బై సినిమాలోనూ నటిస్తోంది.

ట్వీట్..

రష్మిక రిప్లై..

Also Read: Shekar Kammula: ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్.. శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఆ హీరోతోనేనా ?

ఆ సీనియర్ హీరోయిన్ డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?