Low Blood Pressure: అధిక రక్తపోటు(High Blood Pressure)స్ట్రోక్‌కు ప్రధాన కారణమని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవలి పరిశోధనలో మరొక కారణం వెలుగులోకి వచ్చింది. కొత్త పరిశోధన ప్రకారం, తక్కువ రక్తపోటు(Low Blood Pressure) కూడా స్ట్రోక్‌కు కారణమవుతుంది. బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డాక్టర్ హ్యూగో జె. అప్రిసియో తన పరిశోధనలో ఈ వాదనను చేశారు. పరిశోధకుడు చెబుతున్న దాని ప్రకారం.. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న రోగులలో 10 శాతం మందికి స్ట్రోక్ ప్రమాదం ఉంది.
తక్కువ రక్తపోటు.. స్ట్రోక్ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్న 30 వేల మంది వృద్ధులపై అధ్యయనంచేస్తున్నారు. వీటిలో 18 నెలల క్రితంవచ్చిన స్ట్రోక్ కేసులు కూడా ఉన్నాయి. ధూమపానం చేసిన రోగులు, గుండె జబ్బులు ఉన్నవారు.. చిత్తవైకల్యం లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు. అధిక రక్తపోటు మాత్రమే కాదు, తక్కువ రక్తపోటు కూడా స్ట్రోక్‌కు కారణమవుతుందని పరిశోధన డేటా చెబుతోంది.
లో బీపీ ఎలా తెలుసుకోవడం..
నిత్యం ఉద్యోగం చేసే మహిళలు, పురుషులు వారికి తెలియకుండానే లో బీపీకి గురవుతున్నారు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వారికి ఈ సమస్య ఉందని. చాలా మంది ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. తినే తిండి, వ్యాయామం చేయకపోవడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రిళ్లు ఎక్కువ టైం మేల్కొనడం లాంటి కారణాలు ఉన్నాయి. దీనిని చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఒక్కోసారి ఇది ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా మహిళలు దీని భారిన ఎక్కువగా పడుతుంటారు. అయితే లో బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య శాస్త్రం ప్రకారం డయాస్టోలిక్ ప్రెషర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే.. లోబీపీ ఉన్నట్లే. మహిళల్లో.. 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లు చెప్పవచ్చు. మనకు లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. కూర్చొని పైకి లేచినప్పుడు తల దిమ్ముగా అనిపిస్తుంది. కళ్లు మసకగ్గా కనపిస్తాయి. త్వరగా అలసిపోతారు. ఎక్కువ సేపు పనిచేయలేరు. తేలికగా తలనొప్పి , వికారంగా ఉంటుంది. అప్పడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది. తరచూ ఇలాగ ఉంటే లోబీపీ కావచ్చు.
ప్రమాద కారకాలను తగ్గించడం అవసరం
స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి.. తక్కువ-రక్తపోటుపై నిఘా ఉంచడంతోపాటు, దాని ప్రమాద కారకాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండండి. గుండె జబ్బులు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే జీవనశైలిని అనుసరించండి.
తక్కువ రక్తపోటును సాధారణంగా ఉంచడానికి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
ఇవి కూడా చదవండి: Electric Vehicles: వచ్చే రెండేళ్లలో పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!