Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking: సిగరేట్‌ మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? పూర్తి వివరాలు..!

Smoking:  ధుమపానం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ దానిని మాత్రం మానరు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఊపిరితిత్తులతో..

Smoking: సిగరేట్‌ మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2021 | 8:59 AM

Smoking: ధుమపానం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ దానిని మాత్రం మానరు. . ధూమపానం ఎక్కువ అలవాటు ఉన్నవారికి.. దాన్ని విడిచిపెట్టడం అంత తేలికైన పని కాదు. నికోటిన్‌ వ్యసనం నుంచి విముక్తి పొందడమే పెద్ద సవాలు అని చెప్పాలి. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఊపిరితిత్తులతో సహా శరీరంలో అన్ని భాగాలపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు కూడా ముందుగా సిగరేట్‌ తాగడం మానేయాలని సూచిస్తుంటారు. అయితే సిగరేటు తాగేవారు కూడా ధూమపానం మానేస్తే బాగుటుందని సలహా ఇస్తుంటారు. ఇక ధూమపానం మానేసినప్పుడు మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి సిగరేట్‌ తాగడం మానేస్తే శరీరంలో ఎన్ని మార్పులు ఉంటాయి..  వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

సిగరేట్‌ మానేసిన 8 గంటల తర్వాత.. చివరిగా మీరు సిగరేట్‌ మానేసిన 8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్‌ మరియు కార్బన్‌ మోనాక్సైడ్‌ పరిమాణం తగ్గుముఖం పడుతుంది. కానీ సగం వరకు ఇంకా ఉంటుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌ అనేది శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తొలగించే రసాయనం. దీని కారణంగా సిగరేట్‌ తాగేవారికి కండరాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అదే సమయంలో 8 గంటల తర్వాత మీరు సిగరేట్‌ తాగేందుకు చాలా కోరికలు కలుగుతాయి. ఒక సమయంలో 5-10 నిమిషాలు సిగరేట్‌ తాగాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. దీని కోసం చూయింగమ్‌ మొదలైనవి నమలడం వల్ల ధూమపానం కోరిక నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

12 గంటల తర్వాత.. మీరు సిగరేట్‌ మానేసిన 12 గంటల తర్వాత శరీరంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. శరీరంలో ఒకమైన మార్పు వస్తుంది. గుండె పని తీరులో మార్పు వస్తుంది. ఎందుకంటే గుండె ఆక్సిజన్‌ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు.

ఒక రోజు తర్వాత.. మీరు రోజుకు ఒక ప్యాక్‌ స్మాక్‌ చేస్తే మీరు ధూమపానం చేయని వారి కంటే గుండెపోటు వచ్చే అవకాశం రెండింతలు ఉంటుంది. ఒక రోజంతా సిగరేట్‌ లేకుండా బయటకు వెళితే మీరు మెల్లమెల్లగా ధూమపానం మానేసే విధంగా చేసుకోవచ్చు. మీరు సిగరేట్‌ మానేసిన తర్వాత అంటే రెండు రోజుల తర్వాత మీ శరీరంలో మార్పులు ఉంటాయి. మీ నరాల చివరలు నయం కావడానికి చర్య ప్రారంభం అవుతుంది. మరో వైపు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. అదే సమయంలో నికోటిన్‌ కూడా ఉండకుండా చేస్తుంది. ఈ సమయంలో విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం, ఆకలిగా లేదా అలసటగా ఉండటం అనేవి సర్వసాధారణం. చాలా మందికి తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభం అవుతుంది.

2 వారాల నుంచి 3 నెలల వరకు.. మీరు సిగరేట్‌ మానేసిన తర్వాత మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. సిగరేట్‌ మానేసిన 2 వారాల నుంచి 3 నెలల్లో ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. దీంతో మీరు వ్యాయమం చేయడం వల్ల మీ శరీరంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ఏడాది తర్వాత.. మీరు సిగరేట్‌ మానేసిన ఏడాది తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి పైగా తగ్గిపోతుంది. దీని వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?

Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!