AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinegar Benefits: సమ్మర్ సీజన్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటంటే..

Apple Cider Vinegar: ఆపిల్ సైడర్ వెనిగర్(Apple Cider Vinegar) వంటగదిలో ఉపయోగించే ఒక రకమైన హెల్తీ టానిక్. దీనితో, మీరు ఒకటి కంటే ఎక్కువ రుచికరమైన పానీయాలను తయారు చేసుకోవచ్చు.. అలాగే మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా..

Vinegar Benefits: సమ్మర్ సీజన్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటంటే..
Apple Cider Vinegar
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2022 | 9:19 PM

Share

ఆపిల్ సైడర్ వెనిగర్(Apple Cider Vinegar) వంటగదిలో ఉపయోగించే ఒక రకమైన హెల్తీ టానిక్ అని చెప్పవచ్చు. దీనితో, మీరు ఒకటి కంటే ఎక్కువ రుచికరమైన పానీయాలను తయారు చేసుకోవచ్చు.. అలాగే మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ వాడటం వల్ల వేడి, లూజ్ మోషన్, స్ట్రెస్ వంటి సమస్యల నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వేసవి కాలంలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవచ్చు. పార్టీల సమయంలో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అలానే ఆపిల్ సైడర్ వెనిగర్, వైట్ వెనిగర్ ను కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. బరువు తగ్గడానికి, అందాన్ని పెంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ని బాగా ఉపయోగిస్తుంటాం. అయితే కేవలం ఈ రెండు మాత్రమే కాకుండా వెనిగర్ లో డజన్ల కొద్దీ రకాలు ఉన్నాయి. ఇవి సులువుగా మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి.

వేడి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి.. 

వేసవి ప్రభావం చూపకుండా ఉండటానికి మీరు ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు వేడి నుంచి రక్షణతో పాటు మరెన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇలా…

  • ఒత్తిడి తగ్గుతుంది.
  • అజీర్ణం సమస్య లేదు
  • గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం పొందుతుంది
  • యాపిల్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంది. దీని కారణంగా ఇది శరీరాన్ని మంట నుండి కాపాడుతుంది.
  • ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది
  • గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది

ఆపిల్ సైడర్ వెనిగర్ 

ఉదయం నిద్రలేచిన తర్వాత నోటి దుర్వాసన ఉన్నట్లైతే మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి.. పుక్కిలించాలి. ఇలా శ్వాసలో కూడా తాజాదనం ఉంటుంది. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కడుపు ఇన్ఫెక్షన్..

యాపిల్ సైడర్ వెనిగర్‌ని గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకుంటే కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్