Jackfruit Benefits: వేసవిలో పనసపండు తినడం వల్ల వ్యాధులు దూరం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు..

సాధారణంగా వేసవిలో తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేట్‏కు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన ఆహారపదార్థాలను

Jackfruit Benefits: వేసవిలో పనసపండు తినడం వల్ల వ్యాధులు దూరం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు..
Jackfruit
Follow us

|

Updated on: Apr 04, 2022 | 6:49 PM

సాధారణంగా వేసవిలో తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేట్‏కు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన ఆహారపదార్థాలను తీసుకోవాలి. అందులో పనసపండు ఒకటి. ఈ పండను ఎంతో ఇష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. దీనిలో అనేక పోషకాలున్నాయి. వేసవిలో పనసపండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి . కేవలం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ పనసపండు కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పండు తినడం వలన అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా.

మధుమేహం నియంత్రణ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పనసపండు దివ్యౌషదం. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ విడుదలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల చక్కెర స్థాయి అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. వాతావరణం మారుతున్న కొద్దీ అనేక సీజనల్ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడంలో ఈ పండు ఉపయోగపడుతుంది. డైటరీ ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ , ఫాస్పరస్ వంటి పోషకాలు, ఇందులో ఉండే విటమిన్లు-ఎ, సి, బి, వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు తగ్గడం.. తక్కువ కేలరీలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉండే పనసపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా.. పసనపండు తినడం వల్ల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఎముకలు దృఢంగా ఉంటాయి.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పనసపండు కాల్షియం మూలం. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఇది కాకుండా విటమిన్-సి, మెగ్నీషియం కూడా ఇందులో ఉన్నాయి, ఇది ఎముకలను బలంగా చేయడానికి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.

నిద్రలో మేలు చేస్తుంది.. నిద్రలేమి వంటి నిద్ర రుగ్మతలలో కూడా పనసపండు మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్ల స్థాయిని నియంత్రిస్తుంది. దీని వల్ల నరాలకు విశ్రాంతి లభిస్తుంది దీంతో సరైన నిద్ర ఉంటుంది. ఆహారంలో క్రమం తప్పకుండా ఈ పనసపండును చేర్చడం ద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.