Turmeric Milk: చలికాలంలో రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మంచిదేనా ?..ఈ విషయాలను తెలుసుకోండి..

|

Dec 21, 2021 | 8:08 AM

సాధారణంగా మన ఇంట్లో ఉపయోగించే పసుపులో అనేక ఔషద గుణాలుంటాయన్న సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి

Turmeric Milk:  చలికాలంలో రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగితే మంచిదేనా ?..ఈ విషయాలను తెలుసుకోండి..
Turmeric Milk
Follow us on

సాధారణంగా మన ఇంట్లో ఉపయోగించే పసుపులో అనేక ఔషద గుణాలుంటాయన్న సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక రోజూ పాలు తాగడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా.. మెదడు చురుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. పాలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మెదడులోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పాలు తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.

ఇక గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇది సీజన్ వ్యాధులను నియంత్రించడానికి ఎక్కువగా సహాయపడతాయి. ఇక రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో రాత్రిళ్లు నిద్రపోయే ముందు పసుపు పాలు తాగడం వలన పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పాలల్లో కాల్షియం, విటమిన్ డి, బి2, బి 12, జింక్, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం అధికంగా ఉంటాయి. అలాగే పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక స్వభావం కలిగి ఉంటుంది. పసుపు పాలు తాగడం వలన జలుబు, దగ్గు, ప్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వాసకోస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. కఫం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే పసుపు పాలు తీసుకోవడం మంచిది.

ఇక నిద్రలేమి సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం మంచిది. రోజూ రాత్రి పసుపు పాలు తాగడం వలన మంచి నిద్రను పొందుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తలనొప్పి, ముక్కు దిబ్బడ, కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కామెర్లను నియంత్రిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలంగా ఉంటాయి. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి.. ఒంటి నొప్పులు తగ్గుతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలోనూ పసుపు పాలు సహయపడతాయి.

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..