AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Bottle: రాగి బాటిల్‏లో నీళ్లు తాగుతున్నారా ? రోజుకు ఎన్ని గంటలు నీరు ఉంచాలి.. ప్రయోజనాలెంటో మీరు తెలుసుకోండి..

ప్రస్తుతం అందరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇవి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా..

Copper Bottle: రాగి బాటిల్‏లో నీళ్లు తాగుతున్నారా ? రోజుకు ఎన్ని గంటలు నీరు ఉంచాలి.. ప్రయోజనాలెంటో మీరు తెలుసుకోండి..
Copper Water
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2021 | 3:06 PM

Share

ప్రస్తుతం అందరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇవి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా.. తక్కువ బరువుతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఉండడంతో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్‏లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. స్టీల్, గాజు, రాగి పాత్రలలో నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాగి పాత్రలో నీళ్లు తాగడం వలన అనేక ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. వివిధ అనారోగ్య సమస్యలను సైతం నివారించవచ్చు. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనం ప్రకారం.. తలనొప్పి, కలరా చికిత్సలో రాగి వాడకం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడైంది. అలాగే రాగి ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే.. గ్లాసులు, పాత్రలు, సీసాలకు బదులుగా రాగిని ఉపయోగిస్తే ఎక్కువ ఫలితాలను అందిస్తుంది. రాగి పాత్రలు, సీసాలు ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

1. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్, వాటి దుష్ప్రభావాలను తగ్గించడంలోనూ సహయపడతాయి. 2. రాగిలో మెలనిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మాన్ని యూవీ నుంచి కాపాడుతుంది. 3. అమెరికన్ క్యాన్సర్ సోసైటీ ప్రకారం రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. 4. ఇది థైరాయిడ్ గ్రంధి సజావుగా పనిచేయడానికి సహయపడుతుంది. 5. అలాగే హిమోగ్లోబిన్ తయారీకి.. శరీరంలోని ఇనుమును పీల్చుకోవడమే కాకుండా.. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. 6. రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 7. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో రాగి నీరు ఎక్కువగా పనిచేస్తుంది. 8. ఇది రక్త కణాలలో ఉండే ఫలకాన్ని తొలగించడం ద్వారా రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 9. రాగి ఒక సహజ యాంటీబయాటిక్. 10. రాగి నీరు తాగడం వలన కలరా లేదా కలుషిత నీటి వలన కలిగే అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. 11. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

రాగి సీసాలో నీరు ఎంతసేపు ఉంచాలి అంటే.. ఒక కాపర్ గ్లాస్, జగ్ లేదా బాటిల్‌లో రాత్రిపూట నీటిని ఉంచి.. ఉదయాన్నే తాగండి. 6 నుంచి 8 గంటలు నీరు ఉండడం చాలా ప్రయోజనకరం. ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగడం చాలా ప్రయోజనకరం. రోజుకు రెండుసార్లు నీటిని నింపి తాగాలి. అయితే అందులో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకూడదు. ** చాలా రోజులు రాగి సీసాలో నీరు తాగితే మంచిదే.. కానీ అలాగే ఉపయోగించకూడదు. కొద్ది రోజులు దానికి విరామం ఇవ్వాలి. అంటే ఒక నెలపాటు క్రమం తప్పకుండా నీరు తీసుకుంటే.. ఒక నెల తర్వాత రెండు నెలలు అలాగే ఉంచి.. నార్మల్ వాటర్ తాగాలి. ** రాగి బాటిల్ లేదా గ్లాస్ మొదలైన వాటిలో వేడి లేదా చాలా చల్లటి నీటిని ఎప్పుడూ నిల్వ చేయవద్దు. ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నీటిని నిల్వ చేయండి. ** రాగి పాత్రలు ఆక్సిజన్, నీరు ఉన్నప్పుడు నల్లగా మారతాయి. నిమ్మ, ఉప్పుతో స్క్రబ్ చేస్తూ.. వాటిని క్లీన్ చేయాలి.

Also Read: Megastar Chiranjeevi: ఈరోజు చిరంజీవికి చాలా స్పెషల్ డే.. ఆసక్తికర ట్వీట్ చేసిన మెగాస్టార్..

Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..