Kissing Bug: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న చిన్న కీటకం.. ప్రాణాంతకమైన చాగస్ వ్యాధి వ్యాప్తి.. లక్షణాలు ఏమిటంటే
అమెరికాలో ఒక్క కీటకం బీభత్సం సృష్టిస్తోంది. 32 రాష్ట్రాలలో ముద్దు పురుగులు వ్యాధిని వ్యాపింపజేస్తున్నాయి. వీటిల్లో 8 రాష్ట్రాలలో మానవులలో కూడా ఈ వ్యాధి సంక్రమణ కేసులు వెలుగులోకి వచ్చాయి. చాగస్ వ్యాధి ముద్దు పురుగు కాటు వల్ల వ్యాపిస్తుందని.. ఇది ప్రాణాంతకమని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు, దానిని నివారించే మార్గాలను తెలుసుకుందాం..

అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఒక చిన్న కీటకం భయాందోళనలు సృష్టిస్తోంది. దీని పేరు కిస్సింగ్ బగ్. మానవులలో దీని ఇన్ఫెక్షన్ కేసులు ఇక్కడ 8 రాష్ట్రాల్లో కూడా నమోదయ్యాయి. అస్సాస్సిన్ బగ్ అని కూడా పిలువబడే కిస్సింగ్ బగ్, చాగస్ డిసీజ్ అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌ను వ్యాపిస్తుంది.
ఈ కీటకం రాత్రి సమయంలో వ్యక్తి ముఖం చుట్టూ ఉన్న మృదువైన భాగాలను (కళ్ళు లేదా పెదవుల దగ్గర వంటివి) కుట్టి, అదే ప్రదేశంలో మలవిసర్జన చేస్తుంది. ఈ మలంలో ఉండే పరాన్నజీవులు వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ వ్యక్తి అనుకోకుండా కిస్సింగ్ బగ్ కుట్టిన చోట గోకినప్పుడు, దాని మలం కళ్ళు, నోరు లేదా అక్కడ ఏర్పడిన గాయంద్వారా శరీరం లోకి పరాన్నజీవి చొచ్చుకుపోతుంది. దీనికి ఒక్క చిన్న గీత అయినా చాలు. చాగస్ వ్యాధి లక్షణాలు ఏమిటి? నివారణకు ఏమి చేయాలో తెలుసుకుందాం. ఈ వ్యాధి రెండు దశల్లో అభివృద్ధి చెందుతుం
చాగస్ వ్యాధి లక్షణాలు ఏమిటి?
తీవ్రమైన దశ: ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ప్రారంభమవుతుంది. కొన్ని వారాల పాటు ఉంటుంది. ఈ సమయంలో లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. కొన్నిసార్లు అస్సలు కనిపించవు. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే అవి ఇలా ఉండవచ్చు-
జ్వరం, అలసట
తలనొప్పి, శరీర నొప్పులు
చర్మంపై దద్దుర్లు
వికారం, వాంతులు లేదా విరేచనాలు
వాపు
ఆకలి లేకపోవడం
దీర్ఘకాలిక దశ: ఈ దశ సంక్రమణ తర్వాత 10-20 సంవత్సరాల తర్వాత కూడా అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన దశ తర్వాత.. ఈ పరాన్నజీవి శరీరంలో దాగి ఉండి గుండె , ప్రేగులను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ దశ తీవ్రమైన లక్షణాలు-
గుండె సమస్యలు – గుండె కండరాల వాపు, గుండె విస్తరణ, సక్రమంగా లేని హృదయ స్పందనలు, ఆకస్మిక గుండెపోటు లేదా గుండె ఆగిపోయే ప్రమాదం.
జీర్ణవ్యవస్థ సమస్యలు– పేగులు విస్తరించడం వల్ల కడుపు నొప్పి , మలబద్ధకం, లేదా అన్నవాహిక విస్తరించడం వల్ల మింగడంలో ఇబ్బంది.
ఎవరికి ప్రమాదం ఉంది?
అమెరికాలో అనేక రాష్ట్రాల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఈ ప్రత్యేక వ్యాధి గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. USలో దాదాపు 300,000 మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారని అంచనా వేయబడినప్పటికీ, 2% కంటే తక్కువ మందికి మాత్రమే తాము ఈ పరాన్నజీవి బారిన పడినట్లు తెలుసు. లాస్ ఏంజిల్స్ కౌంటీలోనే దాదాపు 45,000 కేసులు ఉన్నట్లు భావిస్తున్నారు.
చాగస్ వ్యాధిని నివారణకు ఏమి చేయాలి?
- ఈ వ్యాధి ప్రధానంగా కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తుంది. కనుక కీటకాల నుంచి రక్షణ చాలా ముఖ్యమైనది.
- ఈ కీటకాలు కనిపించే ప్రాంతాలలో, నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి.
- ఈ కీటకాలు దాగి ఉండే ఇంట్లో పగుళ్లు ,గోడలను మరమ్మతు చేయండి. ఇంటి చుట్టూ ఉన్న పొదలు , కలప చెత్తని తొలగించండి.
- ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాలలో తగిన పురుగుమందులను పిచికారీ చేయండి.
- చాగస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








