Female infertility: మహిళలూ జాగ్రత్త.. ఈ అలవాట్లు ఉంటే తల్లి కాలేరట..
Infertility In Women: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేయవచ్చు. అయితే.. మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ స్త్రీల అలవాట్లు కూడా వారి సంతానోత్పత్తి క్షీణతకు కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Infertility In Women: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేయవచ్చు. అయితే.. మహిళల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ స్త్రీల అలవాట్లు కూడా వారి సంతానోత్పత్తి క్షీణతకు కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కథనంలో మహిళల్లో సంతానలేమికి గల కారణాల గురించి.. అలాగే.. ఎలాంటి అలవాట్లు సంతానలేమికి కారణమవుతాయి..? ఎలాంటి తప్పులు చేయకూడదు.. అనే విషయాలను తెలుసుకోండి..
అనారోగ్యకరమైన ఆహారం తినడం..
సంతానోత్పత్తిని కాపాడుకోవడంలో ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ బరువు పెరగడం లేదా చాలా తక్కువ బరువు ఉండటం రెండూ అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం తక్కువ అండోత్సర్గము, గర్భాశయ సమస్యలతో ముడిపడి ఉంటుంది.
ధూమపానం – మద్యపానం..
ధూమపానం, మద్యపానం మొత్తం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా ఇది సంతానోత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ధూమపానం ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది.. ఇంకా అండాశయాలను దెబ్బతీస్తుంది. అదే సమయంలో, ఆల్కహాల్ అధిక వినియోగం ఋతు చక్రం సక్రమంగా రాకుండా చేయడం.. గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుంది.
వ్యాయామం లేకపోవడం..
శారీరకంగా చురుకుగా ఉండటం బరువు నిర్వహణలో మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రెగ్యులర్ వ్యాయామం ఋతు చక్రం క్రమబద్ధీకరించడానికి, గర్భాశయం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, అధిక వ్యాయామం కూడా హానికరం, ఇది ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది..
అధిక ఒత్తిడి తీసుకోవడం..
ఒత్తిడి హార్మోన్లు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి వలన అండోత్సర్గము ఆలస్యం అవుతుంది.. గర్భాశయంలోని పొర సన్నబడటం వలన గర్భధారణ కష్టమవుతుంది.
క్రమరహిత పీరియడ్స్‌ను విస్మరించడం..
క్రమరహిత లేదా బాధాకరమైన ఋతుస్రావం వంధ్యత్వానికి దారితీసే అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి పరిస్థితులు రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. గర్భం దాల్చే అవకాశాలను తగ్గిస్తాయి. అటువంటి పరిస్థితిలో దానిని విస్మరించడం పెద్ద తప్పు అని నిరూపించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..