Pulasa: పులస క్రేజ్ మాములుగా లేదండోయ్.. జాలర్ల పంట పండిస్తున్న చేపలు.. కేజీ ధర ఎంతో తెలిస్తే షాకే..

|

Aug 29, 2022 | 11:06 AM

పులస (Pulasa).. ఏ పేరుకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే అటు మత్సకారులకు, ఇటు భోజన ప్రియులకు పండగే. ఎందుకంటే ఇప్పడు పులసల సందడి మొదలైంది. ఈ చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి కాబట్టి వీటికి..

Pulasa: పులస క్రేజ్ మాములుగా లేదండోయ్.. జాలర్ల పంట పండిస్తున్న చేపలు.. కేజీ ధర ఎంతో తెలిస్తే షాకే..
Godavari Pulasa
Follow us on

పులస (Pulasa).. ఏ పేరుకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే అటు మత్సకారులకు, ఇటు భోజన ప్రియులకు పండగే. ఎందుకంటే ఇప్పడు పులసల సందడి మొదలైంది. ఈ చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి కాబట్టి వీటికి మార్కెట్ లో డిమాండ్ అధికంగా ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు బారులు తీరుతారు. అంతటి విశిష్టత కలిగిన ఈ చేప కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. నదికి ఎదురీదుతూ వస్తున్న పులసలు జాలర్ల పంట పండిస్తున్నాయి. యానాం (Yanam) మార్కెట్లో గతవారం రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేలకు అమ్ముడయ్యింది. తాజాగా అంతే బరువున్న మరో చేప జాలరి వలలో చిక్కింది. ఈ సారి ఈ చేప మరింత ఎక్కువ ధర పలికింది. ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను ఆగస్టు 28 సాయంత్రం స్థానిక రాజీవ్‌ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని 22 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ పులస చేప కేవలం వర్షాకాలంలో మాత్రమే లభ్యమవుతుంది. అది కూడా గోదావరి (Godavari) లో కొత్త నీరు వచ్చినప్పుడే ఉంటుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘ఇల్సా చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా అని కూడా పిలుస్తారు. పశ్చిమ బంగాల్ ప్రజలు ఈ హిల్సా చేపలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.

పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ఫేమస్ డిష్. ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత.

ఈ తతంగమంతా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరుకు సముద్రంలోకి వెళ్లిపోతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతుంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..