Diet Tips: టేస్టీగా ఉన్నాయని ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తెగ లాగించేస్తున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే..

రుచిలో కమ్మగా అనిపించే ఈ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Diet Tips: టేస్టీగా ఉన్నాయని ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తెగ లాగించేస్తున్నారా? అయితే డేంజర్‌లో పడినట్లే..
Instant Noodles
Follow us
Basha Shek

|

Updated on: Oct 15, 2022 | 4:44 PM

నూడుల్స్ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆహారం. ముఖ్యంగా ఇన్‌స్టంట్ నూడుల్స్ ఈ మధ్యన చాలామంది ఫేవరెట్‌ ఫుడ్‌గా మారిపోయింది. టేస్టీగా ఉండడంతో పాటు వీటిని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే చాలామంది లొట్టలేసుకుని మరీ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను తింటున్నారు. కాగా ఈ రకమైన నూడుల్స్‌ను మొదటిసారిగా తయారుచేసిన ఘనత  జపనీయులకే చెందుతుంది. అయితే నేడు ఈఫుడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే రుచిలో కమ్మగా అనిపించే ఈ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌లో సాధారణంగా పామాయిల్‌తో పాటు పిండి, పిండి, నీరు, ఉప్పు, కాన్సుయి, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్ ఉంటాయి. ఇది కాకుండా మసాలాలు, ఉప్పు, మోనోసోడియం గ్లుటామేట్ కూడా ఉంటాయి. కాగా WHO ఒక రోజులో 2 గ్రాముల సోడియంను మాత్రమే తీసుకోవాలని సూచిస్తుంది. అయితే 100 గ్రాముల ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో 397 నుంచి 3678 MG సోడియం ఉంటుందట. మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి.

MSG ఆరోగ్యానికి హానికరం

కాగా నూడుల్స్‌ టేస్టీగా ఉండడానికి ఉపయోగించే MSG మన ఆరోగ్యానికి చాలా హానికరం. దీని గురించి అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఇందులో MSG అధికంగా తీసుకోవడం వల్ల తలనొప్పి, తల తిరగడం, అధిక రక్తపోటు, అలసట, బలహీనత, కండరాల ఒత్తిడి, ఛాతీ నొప్పి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని తేలింది. ఇక ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ప్రొటీన్లు ఫైబర్ ఉండవు. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు.

కాగా ప్రొటీన్లతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఫైబర్‌ జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ నూడుల్స్‌ తింటే జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కోరికలను కూడా పెంచుతాయి. చివరకు ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ఇన్ స్టంట్ నూడుల్స్ ను ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి