Foods Avoid Before Sleep: రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి!

 మంచి నిద్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి రోజూ చక్కగా నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి చెక్ పడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 8 గంటల నిద్రన్నా అవసర. నిద్ర చక్కగా ఉంటేనే.. మానసికంగా, శరీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే..

Foods Avoid Before Sleep: రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి!
Sleep

Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 3:00 PM

మంచి నిద్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి రోజూ చక్కగా నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి చెక్ పడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 8 గంటల నిద్రన్నా అవసర. నిద్ర చక్కగా ఉంటేనే.. మానసికంగా, శరీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కెఫిన్ ఉన్న ఆహార పదార్థాలు:

రాత్రి పూట పడుకునేముందు కెఫిన్ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నిద్ర పోయే ముందు కెఫిన్ ఉన్న పదార్థాలు తినడం వల్ల నిద్ర పట్టదు. చాలా మందికి రాత్రి పడుకునే ముందు కాఫీ, టీలు తాగే అలవాటు ఉంది. వీటిని తాగడం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల నిద్ర, ప్రశాంతత కూడా దూరం అవుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్ అండ్ టమాటా:

రాత్రి పడుకునే ముందు టమాటా లేదా సిట్రస్ పండ్లు తినకూడదు. ఇవి తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అదే విధంగా వెన్న లేదా చీజ్ కూడా తినకూడదు.

ఇవి కూడా చదవండి

డీప్ ఫ్రై ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలి:

రాత్రిపూట డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇది నిద్రకు ఆటంకంగా మారుతుంది.

సరైన సమయానికి భోజనం చేయాలి:

రాత్రి పూట 7 గంటల లోపే భోజనం చేసేయాలి. 9 గంటల తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆ తర్వాత తింటే జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. అదే విధంగా అధిక బరువుకు కూడా కారణం అవుతుంది. నిద్ర పోయే ముందు రెండు గంటలలోపే భోజనం చేసేయాలి. దీని వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే త్వరగా మెలకువ వస్తుంది.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి:

రాత్రి పడుకునే గంట ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వీటి నుంచి రేడియేషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందే కాకుండా నిద్ర పరిచే హార్మోన్స రిలీజ్ కావు. పడుకునేంత వరకూ చూస్తే ఉంటే నిద్ర రాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.