Colon Cancer: పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలివే.. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకమే..!

|

Jan 21, 2023 | 10:09 AM

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల క్యాన్సర్లు, రోగాలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా

Colon Cancer: పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలివే.. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకమే..!
Symptoms Of Colorectal Cancer
Follow us on

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల క్యాన్సర్లు, రోగాలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి . ఇది కడుపులోని పెద్దపేగులకి సోకుతుంది. దీనినే మల క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ ప్రారంభం ధశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యులు అధిక ప్రమాదంలో ఉన్న లేదా 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం స్క్రీనింగ్‌ని సిఫార్సు చేస్తున్నారు. ప్రేగు క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పటికీ అవి ఒక్కొక్కటిగా మారుతాయి. అందువల్ల పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం, అలాగే గుర్తించడం చాలా అవసరం.

ప్రేగు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు అతిసారం, మలబద్ధకం, విసర్జనలో సమస్యలు, టాయిలెట్ ఉపయోగించే ఫ్రీక్వెన్సీలో మార్పు, మూత్రంలో రక్తం కనిపించడం లాంటివిగా ఉంటాయి. వైద్యుల ప్రకారం మల రక్తస్రావం కొన్నిసార్లు ప్రేగు క్యాన్సర్ మొదటి అత్యంత గుర్తించదగిన లక్షణమని చెబుతారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాగా, స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద ప్రేగు క్యాన్సర్‌కు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఆలస్యం చేయకుండా కొలనోస్కోపీ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దప్రేగు గోడ లోపల పరిమితంమైన క్యాన్సర్లను శస్త్రచికిత్సతో నయం చేయవచ్చు. కానీ విస్తృతంగా వ్యాపించిన క్యాన్సర్ సాధారణంగా నయం కాదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..