
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఉపిరి తిత్తులు కూడా ఒకటి. ఇవి శరీరంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఊపిరి తిత్తుల ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఇటీవల చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే.. శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా మంది శ్వాస సమస్యలతో కూడా మరణిస్తున్నారు. ఊపిరి తిత్తులు కూడా ఆరోగ్యంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. లంగ్స్‌ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ త్రాగటం వల్ల ఊపిరి తిత్తులు అనేవి పాడైపోతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఊపిరి తిత్తులు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. కొన్ని ఆహారాలు తినడం వల్ల లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆహారంలో భాగంగా పసుపును తీసుకోవడం వల్ల ఊపిరి తిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఊపిరి తిత్తులకు ఎటువంటి నష్టం కలుగకుండా చేయడంలో పసుపు ఎంతో హెల్ప్ చేస్తుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఊపిరి తిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి ఊపిరి తిత్తులను కాపాడడంలో సహాయ పడతాయి.
విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే పాలకూరను తీసుకోవడం వల్ల కూడా ఊపిరి తిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది.
వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో వెల్లుల్లి ఎంతో హెల్ప్ చేస్తుంది. అదే విధంగా అల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫాలీఫినాల్స్ లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయం చేస్తుంది. అలాగే వాతావరణ కాలుష్యం కారణంగా తలెత్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
డ్రై ఫ్రూట్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధగా ఇతర హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.