- Telugu News Photo Gallery Do you know the benefits of drinking salt water in winter season? check here is details in Telugu
Salt Water Benefits: శీతాకాలంలో ఉప్పు నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
శీతా కాలం అనగానే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు బాధ పెడతాయి. దగ్గు వల్ల ఎక్కువగా గొంతు నొప్పి వస్తుంది. ఇలా గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణం.. గొంతులో ఇన్ ఫెక్షన్ ఉండటం. ఈ సమస్యల్ని తగ్గించడానికి వెంటనే ఆస్పత్రిలకు పరిగెడుతూ ఉంటారు. అలా కాకుండా.. నేచురల్‌గా కూడా గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు. సాధారణ ఉప్పు కంటే.. నల్ల ఉప్పు ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి వచ్చిందంటే.. సరిగ్గా తినడానికి, తాగడానికి ఉండదు. మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నొప్పికి ఉప్పు..
Updated on: Jan 13, 2024 | 1:05 PM

శీతా కాలం అనగానే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు బాధ పెడతాయి. దగ్గు వల్ల ఎక్కువగా గొంతు నొప్పి వస్తుంది. ఇలా గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణం.. గొంతులో ఇన్ ఫెక్షన్ ఉండటం. ఈ సమస్యల్ని తగ్గించడానికి వెంటనే ఆస్పత్రిలకు పరిగెడుతూ ఉంటారు. అలా కాకుండా.. నేచురల్‌గా కూడా గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు. సాధారణ ఉప్పు కంటే.. నల్ల ఉప్పు ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గొంతు నొప్పి వచ్చిందంటే.. సరిగ్గా తినడానికి, తాగడానికి ఉండదు. మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నొప్పికి ఉప్పు వాటర్‌తో చెక్ పెట్టొచ్చు. కేవలం గొంతు నొప్పి మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఉప్పు నీరు పుక్కిలించడం వల్ల ముందు నోరు శుభ్ర పడుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా బయటకు పోతుంది. అదే విధంగా పళ్లకు కూడా రక్షణగా ఉంటుంది. నోటిలో ఉండే దుర్వాసన కూడా తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

గొంతు నొప్పితో బాధ పడేవారు గోరు వచ్చటి నీళ్లలో ఉప్పు కలుపుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు పుక్కిలించడం వల్ల గొంతులో ఉండే ఇన్ ఫెక్షన్ దూరం అవుతుంది. దీంతో గొంతు ఫ్రీగా అవుతుంది. గొంతు సమస్యలు దూరం అవుతాయి.

అప్పుడప్పుడు ఉప్పు నీరు తాగడం వల్ల శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్లు, క్యాన్సర్ పుండ్లు వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాకుండా దంత సమస్యలు, చిగుళ్ల నొప్పులు ఉన్న వారు కూడా ఈ సాల్ట్ వాటర్ తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.




