AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: రోజూ రాత్రి లవంగాలు కలిపిన పాలు తాగితే.. ఒత్తిడి మాయం అవుతుంది!!

మీలో చాలా మందికి రోజూ రాత్రివేళలో పాలు తాగే అలవాటు ఉండే ఉంటుంది. ఈ అలవాటు మంచిదే. గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది. పాలల్లో క్యాల్షియంతో పాటు.. శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్పరస్, విటమిన్ డి ఇంకా ఎన్నో పోషకాలున్నాయని తెలిసిన విషయమే. అయితే పాలల్లో.. మార్కెట్లో దొరికే ఏవేవో పొడులు కలిపి తాగుతుంటారు. వాటిలో చాలా వరకూ కలుషితమైనవే ఉంటాయి. కొన్నిపొడుల్లో షుగర్..

Kitchen Hacks: రోజూ రాత్రి లవంగాలు కలిపిన పాలు తాగితే.. ఒత్తిడి మాయం అవుతుంది!!
Cloves (6)
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 5:15 AM

Share

మీలో చాలా మందికి రోజూ రాత్రివేళలో పాలు తాగే అలవాటు ఉండే ఉంటుంది. ఈ అలవాటు మంచిదే. గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది. పాలల్లో క్యాల్షియంతో పాటు.. శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్పరస్, విటమిన్ డి ఇంకా ఎన్నో పోషకాలున్నాయని తెలిసిన విషయమే. అయితే పాలల్లో.. మార్కెట్లో దొరికే ఏవేవో పొడులు కలిపి తాగుతుంటారు. వాటిలో చాలా వరకూ కలుషితమైనవే ఉంటాయి. కొన్నిపొడుల్లో షుగర్ ఎక్కువగా కలుపుతారు. మరి కొన్ని అయితే.. పల్లీలు, నువ్వుల నుంచి తీసిన వేస్ట్ తో తయారు చేస్తారు. అలాంటివాటిని పాలల్లో కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వాటికి బదులు మన వంటింట్లో ఉండే లవంగాలను పొడిచేసి కలిపి తాగితే ఇంకా మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

లవంగాల్లో కూడా క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ వంటి పోషకాలుంటాయి. పాలల్లో లవంగాల పొడిని కలిపి తాగితే.. అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా.. ఈ సీజన్ లో తరచూ జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి అనారోగ్యాలు వస్తుంటాయి. లవంగాల పాలు తాగితే.. ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయట. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గి.. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగై.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

లవంగాల పొడి కలిపిన పాలు తాగితే.. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరిగి.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నోటి దుర్వాసన, దంతాల నొప్పులు, చిగుళ్లలో వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో రెండు లవంగాల పొడిని కలిపి రోజూ రాత్రి పడుకునే అరగంట ముందు తాగితే.. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు. లేదా ఉదయం పూట కూడా లవంగాల పాలు తాగొచ్చు. 10 ఏళ్ల వయసు దాటిన పిల్లలకు కూడా లవంగాల పొడి కలిపిన పాలను ఇవ్వొచ్చు. ఫలితంగా వారికి తరచూ అనారోగ్యం రాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!